భీమడోలు లాకప్‌డెత్: సీఐ, ఎస్ఐ‌ల సస్పెన్షన్

పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు పోలీస్ స్టేషన్ లో చోరీ కేసులో అరెస్టైన అప్పారావు అనుమానాస్పదస్థితిలో మరణించిన ఘటనపై సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేశారు ఏలూరు రేంజ్ ఐజీ.

Bhimadole CI And SI Suspended In Custodial Death Case

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని Bhimadole పోలీస్ స్టేషన్ లో చోరీ కేసులో  అరెస్టైన Appa Rao   అనుమానాస్పదస్థితిలో మరణించాడు. Police  కొట్టిన దెబ్బలతోనే అప్పారావు మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం అప్పారావును చోరీ కేసులో అనుమానంతో Police లు  అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్ రూమ్ లోనే అప్పారావు  ఉరేసుకొని మరణించాడు. పోలీసులు కొట్టిన దెబ్బలకు అప్పారావు మరణించడంతో ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం  చేస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. 

అప్పారావు కుటుంబ సభ్యులతో పాటు ప్రజా సంఘాలు Eluru ఆసుపత్రి వద్ద ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు కొట్టిన దెబ్బలకే  తండ్రి మట్టపల్లి నాగేశ్వరరావు, తల్లి నాగమణి, అప్పారావు భార్య స్వాతి ఆరోపిస్తున్నారు. నా భర్త ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని పోలీసులే చంపేశారని భార్య స్వాతి ఆవేదనతో చెప్పింది. భర్త మృతితో కుటుంబం రోడ్డు పాలైందని పోషించే నాధుడు లేడని వాపోయింది. పోతునూరు గ్రామస్తులు ఏలూరు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. తగిన న్యాయం చేయాలని నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సంఘటన స్థలానికి ఎస్‌పి రాహుల్‌ దేవ్‌ శర్మ వచ్చి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios