శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో కరోనా రోగి  బాత్‌రూమ్‌లోనే  మరణించాడు.  ఈ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని  బాధితులు ఆరోపిస్తున్నారు.  రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  కరోనా రోగి ఆసుపత్రి బాత్‌రూమ్‌లోనే కన్నుమూశారు.  ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర  రోగులు ఈ విషయాన్ని  గుర్తించి ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

చనిపోయిన రోగిని జిల్లాలోని కోటబొమ్మాళికి చెందిన  భాస్కరరావుగా గుర్తించారు. ఏపీ రాష్ట్రంలో కూడ కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకుగాను  రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది.  కేబినెట్ సబ్ కమిటీ  ఏపీ సీఎం జగన్ తో  భేటీ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను  తీసుకోవాల్సిన చర్యలపై  కేబినెట్ సబ్ కమిటీతో  చర్చించారు.

రాష్ట్రంలో కరోనా  కేసుల పెరుగుదలతో పాటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కూడ ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఆక్సిజన్ నిల్వలను పెంచుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరించింది.రాష్ట్రానికి నాలుగు ప్రాంతాల నుండి ఆక్సిజన్ ను తెప్పించుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.