మూడేళ్ళుగా సహాజీవనం: ఆ తర్వాత ఇలా...

Bharat suicide after kills lover Vanitha and   her son in Chittoor district
Highlights

ఆ ముగ్గురి మృతికి కారణం ఏమిటి

చిత్తూరు: చిత్తూరు జిల్లా  మర్రికుంటలో దారుణం చోటు
చేసుకొంది. సహ జీవనం చేస్తున్న వివాహితను, ఆమె
కొడుకును చంపి  తాను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

చిత్తూరు జిల్లా మర్రికుంట కు చెందిన  వనిత ఆమె ఆరేళ్ళ
కొడుకు రవీందర్ ను వారి సమీప బంధువు భరత్ హత్య
చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. వారిని హత్యచేసిన
తర్వాత అదే ఇంట్లో భరత్ కూడ ఆత్మహత్యకు
పాల్పడ్డాడు.

వనితకు ఓ కొడుకు, ఓ కూతురున్నారు. కూతురు తిరుపతిలో
చదువుకొంటుంది. వనిత భర్త నాలుగేళ్ళ క్రితం  
ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

అప్పటి నుండి వనిత సమీప బంధువు భరత్ తో ఆమె
సహజీవనం చేస్తుందని పోలీసులు చెబుతున్నారు. అయితే
శనివారం నాడు ఆమె మర్రికుంటకు వచ్చింది. అయితే
శనివారం అర్దరాత్రి వనిత, భరత్ మధ్య ఏం  జరిగిందో
తెలియదని స్థానికులు చెబుతున్నారు.

వనితను, ఆమె కొడుకును హత్య చేసిన తర్వాత భరత్
అక్కడే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

loader