రైతు సంఘాలిచ్చిన భారత్ బంద్ కు వైసీపీ నేతృత్వంలోని ఏపీ సర్కార్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.
అమరావతి: రైతు సంఘాలిచ్చిన భారత్ బంద్ కు వైసీపీ నేతృత్వంలోని ఏపీ సర్కార్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.
దీంతో రాష్ట్రంలోని పలు డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. లెఫ్ట్ పార్టీల నేతలు ఇవాళ ఉదయం నుండి పలు బస్సు డిపోల వద్ద బైఠాయించి నిరసనకు దిగారు.
రాష్ట్రంలోని పలు చోట్ల బీజేపీ మినహా ఇతర పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. విజయవాడలో లెఫ్ట్ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. హైద్రాబాద్-విజయవాడ రహదారిపై బైఠాయించి లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
also read:భారత్ బంద్: తెలంగాణలో డిపోలకే పరిమితమైన బస్సులు, నిరసన ప్రదర్శనలు
బస్సులు రాకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందిపడ్డారు.విశాఖపట్టణంలో కూడ లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. తిరుపతిలో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేశారు.బంద్ ను పురస్కరించుకొని పలు పట్టణాల్లో వ్యాపార సంస్థలను మూసివేశారు. పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు రైతులకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారు.
నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో డిల్లీలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు 13 రోజులుగా ఆందోళనకు దిగాయి.. ఈ ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 8, 2020, 11:57 AM IST