తన పుట్టినరోజు పార్టీలోనే ఓ స్నేహితుడిని కత్తులు, కర్రలతో దాడి చేశాడు రౌడీషీటర్ పండు. . 

విజయవాడ: బెజవాడ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు మణికంఠ అలియాస్ పండు మరోసారి రెచ్చి పోయాడు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి స్నేహితులకు పుట్టిన రోజు పార్టీ ఇచ్చాడు రౌడీషీటర్ పండు. ఈ పార్టీలోనే ఓ స్నేహితుడిని కత్తులు, కర్రలతో దాడి చేశారు. సదరు యువకుడు ప్రాణభయంతో బోరున విలపించినా వదిలిపెట్టకుండా చితకబాదారు పండు స్పేహితులు. 

వీడియో

గతేడాది ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెజవాడ గ్యాంగ్ వార్‌లో పండు ప్రధాన నిందితుడు. నగరంలోని యనమలకుదురులో ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్‌ విషయంలో పండు, తోట సందీప్ వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. కత్తులు, కర్రలతో ఇరువర్గాలు ఘర్షణపడ్డారు. ఇందులో గాయపడ్డ తోట సందీప్ కుమార్ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో పండుతో పాటు 40 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరందరిపై రౌడీ షీట్ తెరిచారు. 

ఈ కేసులో బెయిల్ పై విడుదలయిన పండు గ్యాంగ్ మళ్ళీ ఇప్పుడు హల్ చల్ చేసింది. స్నేహితున్ని చితకబాదుతూ కత్తితో బెదిరించిన వీడియో వైరల్ కావడంతో స్పందించిన పెనమలూరు పోలీసులుపండును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.