అమరావతి: విజయవాడలో రేపు జరగాల్సిన బీసీ సభ, బీసీ సంక్రాంతి సభ వాయిదా పడింది. వడ్డెర కార్పోరేషన్ ఛైర్‌పర్సన్ ఘటన వల్లే ఈ పరిస్థితి నెలకొందనే ప్రచారం సాగుతోంది.

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 56 బీసీ కులాలకు చైర్మెన్ పదవులను ఇచ్చింది. కార్పోరేషన్ చైర్మెన్ పదవులను ప్రభుత్వం ప్రకటించింది. కార్పోరేషన్ ఛైర్మెన్, డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవం  ఈ నెల 11వ తేదీన విజయవాడలో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.

also read:టోల్‌ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యం: వడ్డెర కార్పోరేషన్ ఛైర్‌పర్సన్‌పై కేసు

అయితే వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ రేవతి కాజా టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా సిబ్బందితో వ్యవహరించిన తీరుతో ఈ సభను వాయిదా వేసినట్టుగా సమాచారం.బీసీ సంక్రాంతి సభ పేరుతో ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏర్పాటు చేశారు. రేవతి వ్యవహరించిన తీరు విమర్శలకు తావివ్వడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.,

గతంలో కూడ పలుమార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. కానీ కొన్ని కారణాలతో వాయిదా వేశారు. రేపు నిర్వహించాల్సిన కార్యక్రమం రేవతి కారణంగా వాయిదా పడింది. రేవతి తీరుపై వైసీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకొందని సమాచారం.