అమరావతి: రాష్ట్ర వడ్డెర కార్పోరేషన్ ఛైర్‌పర్సన్ దేవళ్ల రేవతితో పాటు ఆమె డ్రైవర్ పై మంగళగిరి పోలీస్ స్టేషన్ పై గురువారం నాడు కేసు నమోదైంది.

గుంటూరు జిల్లాలోని కాజా టోల్ ప్లాజా సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  కాజా టోల్ గేట్ వద్ద సిబ్బందిపై  రేవతి .చేయి చేసుకొంది. టోల్ కట్టకుండా వెళ్తుండగా బారికేడ్లు పెట్టారు.  బారికేడ్లను పెట్టిన టోల్ సిబ్బందిని ఆమె దూషించారు. 

also read:టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి: దేవళ్ల రేవతి స్పందన ఇదీ...

నిబంధనలకు విరుద్దంగా సైరన్  వినియోగం, దౌర్జన్యం, దాడి, టోల్ టాక్స్ ఎగవేత బెదిరింపులకు పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ విషయమై టోల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 టోల్ ప్లాజా సిబ్బంది రేవతిని టోల్ ఫీజు అడిగినందుకు ఆమె దౌర్జన్యం చేశారని టోల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. టోల్ ప్లాజా సిబ్బంది తీరుపై ఆమె వ్యవహరించిన తీరుపై  విమర్శలు వెల్లువెత్తాయి. ఈ  విషయమై వైసీపీ అధిష్టానం ఆరా తీసినట్టుగా సమాచారం.