ఎన్టీఆర్, జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోలను ఉంచారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఏపి అధ్యక్షుడు కళా వెంకటరావు, తెలంగాణా అధ్యక్షుడు ఎల్. రమణ ఫొటోలు ఎందుకు పెట్టలేదు.

మహానాడు సాక్షిగా బిసిలకు అవమానం జరిగింది. బిసిలను అందలం ఎక్కించిందే తెలుగుదేశంపార్టీ అని ఊరా వాడా అదిరిపోయేట్లు చెప్పుకునే టిడిపి నేతలు బిసిలకు జరిగిన అన్యాయంపై ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు. తెలుగుదేశంపార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే మూడురోజుల మహానాడు కార్యక్రమం విశాఖపట్నంలో ఈరోజు మొదలైంది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగురాష్ట్రాల నుండి నేతలు, కార్యకర్తలు వేలాదిమంది హాజరయ్యారు.

అటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో వేదిక మీద పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోలను ఉంచారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఏపి అధ్యక్షుడు కళా వెంకటరావు, తెలంగాణా అధ్యక్షుడు ఎల్. రమణ ఫొటోలు ఎందుకు పెట్టలేదు?

వేదికమీద ఎవరెవరు కూర్చోవాలి? ఎవరెవరి ఫోటోలు ఉంచాలన్నది పూర్తిగా చంద్రబాబు ఇష్టానికి అనుగుణంగానే జరుగుతుందనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అటువంటప్పుడు ఇద్దరి అధ్యక్షుల ఫొటోలు లేదంటే అర్ధమేమిటి? పైగా ఇద్దరూ బిసి సమాజికవర్గాలకు చెందిన వారే అయినప్పుడు వారి ఫొటోలు లేకపోవటంపై నేతల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయం ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? అందుకే వారిలో వారే మాట్లాడుకుంటున్నారు.