భారత దేశంలో ఎవరు ఎక్కడైనా ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు.
భారత దేశంలో ఎవరు ఎక్కడైనా ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్.. ఏపీలో ఎన్నికల ప్రచారం చేయడం విషయంపై స్పందించారు. కేసీఆర్ ఏపీలో ప్రచారం చేస్తే దాని ఫలితం ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన అన్నారు. అలాగే ఆర్థికాభివృద్ధితో దేశంలోని అన్ని రాష్ట్రాలు పురోభివృద్ధి సాధించాలని భగవంతుని ప్రార్థించినట్లు చెప్పారు.
