బాపట్ల నియోజకవర్గంలో కోన రఘుపతి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, శాసన సభాపతిగా, గవర్నర్ గా ఉన్నత పదవులు పొందిన కోన ప్రభాకరరావు కొడుకే ఈ కోన రఘుపతి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ గత రెండుసార్లుగా (2014,2019) బాపట్ల నుండి వైసిపి అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు రఘుపతి. ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేసారు.
బాపట్ల రాజకీయాలు :
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతర్వాత రెండు పార్టీల హవా బాపట్లలో సాగింది. కానీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ రాజకీయంగా బాగా దెబ్బతిని వైసిపి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘకాలం కొనసాగి రాష్ట్రస్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో పదవులు పొందిన కోన కుటుంబం వైసిపిలో చేరడంలో బాపట్లలో కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతింది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కోన రఘుపతి బాపట్ల నుండి పోటీచేసి గెలిచారు. ఇక్కడ టిడిపి కూడా బలంగానే వుంది... మూడుసార్లు ఈ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గెలిచారు.
బాపట్ల అసెంబ్లీ పరిధిలోని మండలాలు :
1. బాపట్ల
2. పిట్టలవానిపాలెం
3. కర్లపాలెం
బాపట్ల అసెంబ్లీ ఓటర్లు (2019 ఎన్నికల ప్రకారం) :
బాపట్లలో నమోదైన మొత్తం ఓటర్లు 1,85,076
పురుషులు - 91,063
మహిళలు - 94,005
బాపట్ల నియోజకవర్గ ఎన్నికలు 2024 - ప్రధాన పార్టీల అభ్యర్థులు :
వైసిపి - మళ్లీ కోన రఘుపతినే బరిలోకి దింపే అవకాశాలున్నాయి.
టిడిపి - వేగేశ్న నరేంద్ర వర్మ ను అభ్యర్థిగా ప్రకటించింది. ( గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి నుండి పోటీచేసిన అన్నం సతీష్ ప్రభాకర్ ఓటమిపాలయ్యారు)
బాపట్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
బాపట్ల అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లు - 1,85,076
పోలైన ఓట్లు - 1,53,769 (83 శాతం)
వైసిపి - కోన రఘుపతి - 79,836 (51.92 శాతం) - 15,199 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - అన్నం సతీష్ ప్రభాకర్ - 64,637 (42 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - లక్ష్మీ నరసింహ ఇక్కుర్తి - 4,006 (2 శాతం)
బాపట్ల అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
పోలైన ఓట్లు - 1,48,808 (83 శాతం)
వైసిపి - కోన రఘుపతి - 71,076 (50 శాతం) - 5,813 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - అన్నం సతీష్ ప్రభాకర్ - 65,263 (46 శాతం) - ఓటమి
