Asianet News TeluguAsianet News Telugu

కుప్పం: బంగారం వేలంతో బజారుపాలైన పరువు

శాంతిపురం ఎస్బిఐ బ్రాంచ్ లో బుధవారం బంగారు వేలాన్ని అధికారులు పూర్తిచేసారు. ఈరోజు కుప్పంలోని కరూర్ వైశ్యాబ్యాంకులో రెండో విడత బంగారు వేలానికి బ్యాంకు రంగం సిద్ధం చేసారు.

Banks auctioned farmers gold in Kuppam for loan recovery

కుప్పం...పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవకర్గం. అటువంటి నియోజకవర్గంలో ప్రజలు ఏ విషయంలోనైనా ఎంత సంతోషంగా ఉండాలి. సిఎం ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి కుప్పంలో అంతా బ్రహ్మాండమని అనుకుంటారు ఎవరైనా. కానీ అది కూడా మిగిలిన నియోజకర్గాలాంటిదే అని తేలిపోయింది.

ఇపుడిదంతా ఎందుకంటే, అసెంబ్లీలో రైతు రుణమాఫీపై దద్దరిల్లిపోయింది. అదే సమయంలో కుప్పంలోని రైతుల పరిస్ధితిపై మీడియాలో వార్తలు కనబడ్డాయ్. అదేమంటే, కుప్పం రైతుల బంగారాన్ని బ్యాంకులు వేలం వేసాయని. దాంతో కుప్పంలో కూడా రైతు రుణమాఫీ సక్రమంగా జరగలేదా అన్న సందేహాలు మొదలయ్యయి. ఇచ్చిన హామీని చంద్రబాబు సక్రమంగా అమలు చేయకపోవటంతో వేలాది రైతు కుటుంబాలు లబోదిబోమంటున్నాయ్. ఎప్పుడో తాకట్టు పెట్టిన బంగారం ఇపుడు బ్యాంకుల వాళ్లు వేలం వేస్తోంటే ఏం చేయలేక మౌనంగా రోధిస్తున్నారు.

కుప్పం నియోజకవర్గంలోని రైతులు తమ బంగారాన్ని కుదవపెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. 2014 మార్చి నెలాఖరుకు తీసుకున్న రుణాల మొత్తం రూ. 247 కోట్లు. అందులో బంగారంపైన తీసుకున్న అప్పే సుమారు రూ. 186 కోట్లు. అప్పటి వరకూ బంగారు రుణాలపై వడ్డీలు కట్టుకుంటున్నారు. అయితే, పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను చూసిన రైతులు అప్పటి వరకూ కడుతున్న వడ్డీలతో పాటు రుణాలను చెల్లించటం కూడా మానేసారు.

అయితే, మిగిలిన రైతుల్లాగే తమ పరిస్ధితి కూడా తయారౌతుందని అప్పట్లో రైతులు అనుకోలేదేమో. తమ రుణాలు మాఫీ కాకపోవటం దేవుడెరుగు. బ్యాంకుల నుండి నోటీసులు రావటం మొదలయ్యాయి. దాంతో రైతులంతా ఆశ్చర్యపోయారు. పార్టీ నేతల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా ఉపయోగం కనబడలేదు. పోనీ తామే రుణాలు, వడ్డీలు కట్టుకుందామన్నా సాధ్యాం కాలేదు. ఎందుకంటే, అప్పటికే కట్టాల్సిన మొత్తాలు పెరిగిపోయాయి. దాంతో ఏం చేయాలో రైతులకు దిక్కుతోచలేదు. ఇంతలో తమ బంగారాన్ని వేలం వేస్తున్నట్లు బ్యాంకుల నుండి నోటీసులు వచ్చాయి. చేసేదేంలేక ఏడుస్తుకూర్చున్నారు.

బంగారాన్ని కుదవపెట్టి ఏ రైతు ఎంతెంత రుణం తీసుకున్నదీ, వారికి సంబంధించిన బంగారాన్ని ఎప్పుడు వేలం వేసేది బ్యాంకులు దినపత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాయి. శాంతిపురం ఎస్బిఐ బ్రాంచ్ లో బుధవారం బంగారు వేలాన్ని అధికారులు పూర్తిచేసారు. ఈరోజు కుప్పంలోని కరూర్ వైశ్యాబ్యాంకులో రెండో విడత బంగారు వేలానికి బ్యాంకు రంగం సిద్ధం చేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios