Asianet News TeluguAsianet News Telugu

వరకట్న వేధింపులు.. బ్యాంక్ ఉద్యోగి భార్య ఆత్మహత్య...

కొంతకాలంగా సృజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్ధలు చెలరేగి తరచుగా గొడవ పడేవారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి పైన మూడో అంతస్తులో సుజన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

bank employee wife suicide over extra dowry harassment in anantapur
Author
Hyderabad, First Published Jan 24, 2022, 10:00 AM IST

అనంతపురం :  సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా వరకట్నం అనే దురాచారం పోవడం లేదు. నేటికీ వరకట్న వేధింపులతో ఎంతో మంది మహిళలు ఆహుతవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే అనంతపురంలో జరిగింది.

అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ bank employee భార్య suicide చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరంలోని నేసేపేటకు చెందిన వెంకటకృష్ణ... తాడిమర్రిలోని SBI శాఖలో పనిచేస్తున్నాడు. 2016లో YSR District పొద్దుటూరు కు చెందిన కొండయ్య, గంగాదేవి  దంపతుల కుమార్తె వెంకట సుజన (26)ను పెళ్లి చేసుకున్నాడు. 

పెళ్లి సమయంలో రూ. 18 లక్షల కట్నం, 30 తులాల బంగారు నగలు సుజన తల్లిదండ్రులు అందజేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా సృజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్ధలు చెలరేగి తరచుగా గొడవ పడేవారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి పైన మూడో అంతస్తులో సుజన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆదివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అదనపు కట్నం కోసమే వేధింపులకు గురి చేసి.. తమ కుమార్తెను హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించారని వెంకటకృష్ణ కుటుంబ సభ్యులతో మృతురాలి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు డీఎస్పీ రమాకాంత్ కు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు... మృతురాలి భర్త ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, గత డిసెంబర్ లో వేముల వాడలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. వేములవాడ: అత్తింటివారి వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి పోలీస్ వాహనం పై కూర్చుని ఆందోళనకు దిగింది. తనకు, తన బిడ్డలకు భర్త, అత్తామామ నుండి రక్షణ కల్పించాలని బాధిత మహిళ పోలీసులను కోరుతూ పోలీస్ స్టేషన్ వద్దే నిరసన చేపట్టింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా (rajanna siricilla district)లో చోటుచేసుకుంది.   

వివరాల్లోకి వెళితే... వేములవాడ (vemulawada) నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి మండలం గైదిగుట్ట తండా కు చెందిన గుగులోతు మౌనికకు ఇద్దరు సంతానం. అయితే వరకట్నం కోసం అత్తింటివారి వేధింపులను తాళలేక పోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. అత్తామామ,భర్త నుండి వరకట్న వేధింపులు (dowry harassment) లేకుండా చూసి న్యాయం చేయాలని  తన పిల్లలతో కలిసి పోలీస్ వాహనం పైకి ఎక్కి నిరసన తెలిపింది. 

గతంలోనూ ఇదే విషయమై భర్తతో గొడవ జరగ్గా పోలీస్టేషన్ లో పిర్యాదు చేశానని బాధిత మహిళ తెలిపింది. అయితే అంగవైకల్యంతో పుట్టిన పాపని చంపేస్తానని కూడా భర్త బెదిరిస్తున్నాడని తెలిపింది. ఇప్పటికైనా పోలీసులు తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంది. 

మహిళ ఆందోళనపై ఎస్సై రాజుని వివరణ కోరగా గతంలోనే భార్యభర్తల గొడవపై కేసు నమోదు అయిందని తెలిపారు. ఇప్పుడు ఆ కేసుపై విచారణ కొనసాగుతోందని... కోర్టు ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని... ఇలా ఎవరికి వారు గొడవలు పెట్టుకోవద్దని ఎస్సై సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios