రూ .1.20 కోట్లతో స్థలం కొన్న అరటిపండ్ల వ్యాపారి !!
అతడో అరటిపండ్ల వ్యాపారి.. కానీ ఏకంగా రూ.1.20 కోట్లతో స్థలం కొన్నాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన నెల్లూరులో జరిగింది. అయితే ఆ స్థలం కేవలం 108 చదరపు అడుగులే కావడం మరో విశేషం.
అతడో అరటిపండ్ల వ్యాపారి.. కానీ ఏకంగా రూ.1.20 కోట్లతో స్థలం కొన్నాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన నెల్లూరులో జరిగింది. అయితే ఆ స్థలం కేవలం 108 చదరపు అడుగులే కావడం మరో విశేషం.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే... నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెంలో ఎస్కే జిలాని అనే చిరు వ్యాపారి, ముంబై జాతీయ రహదారికి ఆనుకుని, బస్టాండ్ సెంటర్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఒకే చోట 40యేళ్లుగా తోపుడు బండిమీద అరటి పండ్లు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు.
అయితే ఇటీవల అక్కడ పాత షాపులు పడగొట్టి, కొత్తగా వాణిజ్య సముదాయం నిర్మించాలని నిర్వహకులు నిర్ణయించారు. ఈ విషయం జిలానికి తెలిసింది. అయితే కాంప్లెక్స్ కడితే తనను అక్కడి నుంచి పంపించేస్తారని, తన జీవనాధారం పోతుందని ఆందోళన చెందారు.
అదే కాంప్లెక్స్ లో ఎంతో కొంత స్థలం కొనాలని నిర్ణయించుకున్నాడు. అంతే బుధవారం జరిగిన వేలం పాటలో పాల్గొన్నాడు. 108 చదరపు అడుగుల స్థలానికి వేలం పాడాడు. ఏకంగా
రూ.1.20 కోట్లు వేలంపాట పాడి సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.