ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ కీలక  నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది.

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. విద్యార్తులు మొబైల్ ఫోన్‌లు తీసుకురావడంపై నిషేధం విధిస్తూ మోమో జారీ చేసింది. అలాగే టీచర్లు సైతం తరగతి గదుల్లోకి ఫోన్లు తీసుకురాకుండా ఆంక్షలు జారీ చేసింది. టీచర్లు క్లాస్‌ రూమ్స్‌కు వెళ్లే ముందుకు మొబైల్స్ హెడ్‌మాస్టర్స్‌కు అప్పగించి వెళ్లాలని సూచించింది. క్లాస్‌రూమ్స్‌లో బోధనకు ఎలాంటి ఆటంకం రాకూడదని, విద్యార్థులు, టీచర్ల దృష్టి పాఠాలపైనే ఉండేందుకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 

యునెస్కో విడుదల చేసిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా విద్యా శాఖ వెల్లడించింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని కూడా పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. 


Also Read: శవ రాజకీయాలు చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన..: దుర్మార్గుడు అంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు..