బాలకృష్ణ రోడ్డుషో జరిగింది. ఒకవైపు వైసీపీపై ఆరోపణలు చేస్తూనే మరోవైపు బహిరంగంగానే డబ్బులు పంచారు.

నంద్యాల ఉపఎన్నికలో టిడిపి ఏ వ్యవస్ధనూ ఖాతరు చేయటం లేదు. ఆఖరుకు ఎన్నికల కమీషన్ నిబంధనలను కూడా యధేచ్చగా ఉల్లంఘిస్తోంది. ఇప్పటికే కోట్ల రూపాయలను ఓటర్లకు వెదజల్లుతోందన్న ఆరోపణలను టిడిపి ఎదుర్కొంటోంది. దానికి తాజాగా జరిగిన ఓ ఘటనే నిదర్శనంగా నిలిచింది. బుధవారం బాలకృష్ణ రోడ్డుషో జరిగింది. ఒకవైపు వైసీపీపై ఆరోపణలు చేస్తూనే మరోవైపు బహిరంగంగానే డబ్బులు పంచుతున్నారు. అందుకు ఈ ఫొటోనే నిదర్శనం. ఒక ఓటరుకు బాలయ్య 100 రూపాయల నోటు అందిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, ఫొటోతో సహా బాలయ్య దొరికిపోయాక వైసీపీ ఊరుకుంటుందా? వెంటనే ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమీషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.