Asianet News TeluguAsianet News Telugu

Badvel bypoll:148 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకం, వాటికి అనుమతి లేదు

బద్వేల్ అసెంబ్లీ స్థానంలో 148 పోలింగ్ స్టేషన్లున్నాయని అధికారులు తెలిపారు. ఈ నియోజకవర్గంలో 281 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 148 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లున్నాయని అధికారులు గుర్తించారు.

Badvel set for bypoll on October 30 with elaborate security arrangements
Author
Kadapa, First Published Oct 29, 2021, 3:52 PM IST

బద్వేల్: Kadapa జిల్లాలోని Badvel అసెంబ్లీ నియోజకవర్గంలో 148 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు.ఈ పోలింగ్ స్టేషన్లలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.ఈ నెల 30వ తేదీన బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. 2019 ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుండి Ycp అభ్యర్ధిగా పోటీ చేసిన డాక్టర్ Venkata Subbaiah విజయం సాధించారు. ఈ ఏడాది మార్చిలో వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

also read:ప్రచారానికి తెర: బద్వేల్, హుజూరాబాద్‌లలో మూగపోయిన మైకులు

బద్వేల్ అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ Dasari Sudha ఆ పార్టీ బరిలోకి దింపింది. Bjp అభ్యర్ధిగా Suresh బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ kamalamma పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుండి Tdp,Jana sena పోటీకి దూరంగా ఉంది. గత సంప్రదాయాలకు అనుగుణంగా పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ, జనసేనలు నిర్ణయం తీసుకొన్నాయి. అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత కూడా పోటీకి దూరంగా ఉండాలని  టీడీపీ నిర్ణయం తీసుకొంది. మరోవైపు ఇదే రకమైన నిర్ణయంతో జనసేన కూడా పోటీకి దూరమైంది. జనసేన నిర్ణయంతో బీజేపీ ఈ స్థానం నుండి పోటీ చేస్తోంది.

ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గాను 281 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ పోలింగ్ స్టేషన్లలో 148 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా పోలీస్ అధికారులు గుర్తించారు.సెంట్రల్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్ సిబ్బంది సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందిని పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు.ఈ నియోజకవర్గంలో 2.16 లక్షల మంది ఓటర్లున్నారు. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే అత్యధిక ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 77.64 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ సమయంలో ఈ నియోజకవర్గంలో 2,04,618 ఓటర్లున్నారు. ఇందులో 1,58,863 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ప్రస్తుతం 2,15,292 మంది ఓటర్లున్నారు.ఇందులో 1,07,915 మంది పురుషులు,1,07,355 మంది మహిళలున్నారు. మరోవైపు 22 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారని ఏపీ అధికారులు ప్రకటించారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్  క్షేత్రస్థాయి పోలీసులకు సూచించారు.మంచినీళ్ల బాటిళ్లు, ఇంకు సీసాలు, బాల్‌పెన్నులు, మొబైల్‌ ఫోన్లు మొదలైన వాటిని పోలింగ్‌ బూత్‌లలోకి అనుమతించకూడదని సూచించారు. పోలింగ్‌ బూత్‌ నుంచి 100 గజాల లోపు జనసందోహం లేకుండా చూసుకోవాలని కోరారు.జిల్లా సరిహద్దుల్లో 23 చెక్‌పోస్టులు, నియోజకవర్గ సరిహద్దుల్లో 14 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఒక్కో చెక్‌పోస్టులో పది మందిని నియమించామని ఎస్పీ తెలిపారు.  ఎన్నికలు పూర్తయ్యేంత వరకు హోటళ్లు, లాడ్జిలు, ఫంక్షన్‌ హాళ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios