గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిబంధనలను ఉళ్లంఘించి అక్రమంగా నిర్మించిన లింగమనేని నివాసంలో కుటుంబంతో కలిసి నివాసముండటం రాజకీయ వివాదంగా మారిన విషయం తెలిసిందే. కృష్ణా నది కరకట్టపై నిర్మించిన ఆ నివాసంలో వుండటమే కాకుండా పక్కనే ఆనాటి ప్రభుత్వంచేతే నిబంధనలను అతిక్రమింపజేసి ప్రజావేదికను నిర్మించారని... దాన్ని కూల్చివేస్తే ఎందుకంత గగ్గోలు పెడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. 

''సజ్జల రెడ్డి గారూ! ఏది అక్రమ నిర్మాణం? 43 కోట్ల ప్రజాధనం లూటీ చేసి బెంగుళూరులో నిర్మించిన యలహంక ప్యాలస్, లోటస్ పాండ్ రాజ ప్రసాదం, తాడేపల్లిలో రాజ్ మహల్ సక్రమమైన నిర్మాణాలా?'' అంటూ ట్విట్టర్ వేదికన అయ్యన్న నిలదీశారు.

read more   అచ్చెన్నాయుడు ఖైదీ నెంబర్ 1573: సజ్జల ఆసక్తికరమైన వ్యాఖ్యలు

''10 ఏళ్లుగా అక్రమ నిర్మాణాల్లో ఉంటున్నారు, ఇకనైనా మారు మనస్సు పొంది ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ఆపండి. అక్రమ నిర్మాణాల్లో నివసిస్తున్న జగన్ రెడ్డిని ఖాళీ చేయించి, ప్రభుత్వ ఖజానా పూరించండి'' అంటూ సజ్జలకు కౌంటర్ ఇచ్చారు అయ్యన్న. 

''నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి తన ఇంటిపక్కనే ప్రభుత్వ నిధులతో అక్రమంగా నిర్మాణంచేస్తే, ఇది తప్పు అని ఈ ప్రభుత్వం దాన్ని కూల్చేస్తే, దానిపై చంద్రబాబు ఏడాది కాలంగా రాజకీయం చేస్తున్నారు. ఇంతకీ ఆయన లింగమనేని అక్రమ నివాసాన్ని ఎప్పుడు ఖాళీచేస్తారు? ఇంకా ఎన్నాళ్లు చట్టాన్ని ఉల్లంఘిస్తారు?'' అంటూ సజ్జల చేసిన ట్వీట్ పైనే అయ్యన్న పై విధంగా స్పందించారు.