విశాఖపట్నం:  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అధికార వైసిపి పోరాటం చేస్తామనడం విచిత్రంగా వుందన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెట్టేలా చేసి దాన్ని కొట్టేయాలని చూస్తున్నవారు పోరాటం చేస్తామంటే ప్రజలెలా నమ్ముతారని అన్నారు. కేవలం జగన్ చేతుల్లో ఉన్న ఘనులు కేటాయిస్తే చాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆరు నెలల్లో లాభల్లోకి వస్తుందని అయ్యన్న పేర్కొన్నారు. 

''కర్మాగారం ఎదో, కారాగారం ఏంటో తెలియని వాడు రాజ్యసభ సభ్యుడు అవ్వడం మన ఖర్మ. గనులన్నీ గాలి బ్రదర్స్ తో కలిసి కొట్టేసిన మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత ఘనులు కేటాయించాలని డిమాండ్ చెయ్యడం విచిత్రంగా ఉంది'' అని ట్విట్టర్ వేదికన విజయసాయిపై మండిపడ్డారు.  

వీడియో

''కర్మాగారం కోసం పోరాడితే జగన్ రెడ్డి కారాగారానికి పోతాడు అందుకే సైలెంట్ గా ఉన్నాడని సాయిరెడ్డి మనస్సులో మాట బయటపెట్టినట్టు ఉన్నాడు. జగన్ రెడ్డి చేతుల్లో ఉన్న ఘనులు కేటాయిస్తే చాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆరు నెలల్లో లాభల్లోకి వస్తుంది'' అని అయ్యన్న తెలిపారు. 

read more   విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రాజకీయాలకు అతీతంగా ఉద్యమం: విజయసాయి

''టిడిపి ప్ర‌భుత్వం అభివృద్ధికి రంగులు వేసిన బులుగు ఊస‌ర‌వెల్లి ..ఢిల్లీలో నీ వేషాలు ఏపీ అంతా చూసింది. నువ్వేమో బ‌డ్జెట్ బాగాలేదంటావు,నీ అక్ర‌మాలు..జైలులో తోడున్న‌ తోడేలులాంటి జ‌గ‌నేమో V ఆకారంలో ఇంత ఘ‌న‌మైన బ‌డ్జెట్టే ఎప్పుడూ చూడ‌లేదంటాడు''  అని మండిపడ్డాడు.

''ఉత్త‌రాంధ్రుల అమ‌యాక‌త్వంతో ఆడుకోవాల‌నుకుంటున్నావు. ఉద్య‌మాల నేల ఇది. మా నేల‌నే క‌బ్జా చేయ‌డానికొచ్చి నిన్ను ఉత్తరాంధ్ర నుంచి ఉరికించి ఉరికించి త‌రిమే రోజు ద‌గ్గ‌ర‌ప‌డింది. క‌సాయిరెడ్డి నోటి తీట‌కు రాజ్య‌స‌భ‌లో అన్నిరాష్ట్రాల‌వారూ మొఖంమీదే ఊశారు. అయినా నీ శాల్తీకి సిగ్గులేదు. మున్సిపాలిటీ మోరీలాంటి ఆ నోటికి హ‌ద్దూఅదుపూ లేదా?'' అంటూ వరుస ట్వీట్లతో విజయసాయిపై అయ్యన్న విరుచుకుపడ్డారు.