Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుతో లింక్ పెట్టి గంటాపై అవంతి శ్రీనివాస్ మరో అస్త్రం

వైసీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మరో అస్త్రం ప్రయోగించారు. చంద్రబాబుతో సంబంధం అంటగట్టి ఆయన విమర్శలు చేశారు.

Avanthi Srinivas Rao another allagation against Ghanta Srinivas Rao
Author
Visakhapatnam, First Published Aug 24, 2020, 5:32 PM IST

విశాఖపట్నం: వైసీపీలో చేరాలని ప్రయత్నిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మరో అస్త్రం ప్రయోగించారు.  చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు కలిసి ఫిల్మ్ క్లబ్ కట్టడానికి అడుగులు వేశారని, వాళ్ళు ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీలో చేరకుండా గంటాను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ విషయంలో రఘురామకృష్ణంరాజు శిఖండి లా వ్యవహరిస్తున్నారని అవంతి శ్రీనివాస్ అన్నారు.అసలు తోట్లకొండ ఎక్కడ ఉందొ, బావి కొండ ఎక్కడ ఉందొ తెలియకుండా రఘు రామకృష్ణంరాజు కేంద్రానికి లేఖలు రాయటం ఏంటి అని మండిపడ్డారు.  నర్సాపురం అభివృద్ధికి ఆలోచించాలి ..నిజంగా అభిమానం ఉంటే రాజీనామా చేసి మళ్లి పోటీ చేసి గెలవాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు మంచి వారన్నారు. 

ఇక్కడి ప్రజలు రాజధాని కోరుకోవడం లెదని పెయిడ్ ఉద్యమాలు చేస్తే , ఇక్కడ ఉద్యమాలు చేసే శక్తి ఇక్కడి ప్రజలకు ఉందన్నారు. సోషల్ జస్టిస్ అనే పవన్ రాజధాని కోసం రెండు వేల ఎకరాలు చాలు అన్నారు. ఇప్పుడు విమర్శలు చేస్తూ చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నారు

విశాఖపట్నం నగరంలోని చిల్డ్రన్ ఏరినాలో సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు , అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్  నగర శాఖ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి మళ్ల విజయప్రసాద్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కే కే రాజు , తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విజయనిర్మల,  సీనియర్ నాయకులు రొంగలి జగన్నాథం పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు  మీడియా తో మాట్లాడుతూ... ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు బురద జల్లడమే పనిగా పెట్టుకుందని అన్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని, ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించారని, ప్రతిపక్షాలు తాత్కాలికంగా నిలుపుదల చేయగలవు తప్ప  శాశ్వతంగా నిలుపుదల  చెయ్యలేవని  అన్నారు. అమరావతి శాసనసభ రాజధానిగా ఉంచుతూ విశాఖపట్నం పరిపాలన రాజధాని, కర్నూల్ న్యాయ రాజధాని  చేసి తీరుతామని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 

ఐదు సంవత్సరాల కాలం లో చంద్రబాబు అమరావతి పేరు చెప్పి కాలయాపన చేశారని, కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమలో కర్నూల్, ఉత్తరాంధ్ర  విశాఖలో ప్రభుత్వ అతిధి గృహాన్ని నిర్మించే ఆలోచన చేశారని చెప్పారు. జీవో 1087 విశాఖ, కాకినాడ, కర్నూల్, విజయవాడ లో ప్రభుత్వ అతిధి గృహలు కట్టాలని కలెక్టర్ లను ఛైర్మెన్ గా చేసి ఉత్తర్వులు ఇచ్చారన్నారు.

 ప్రభుత్వ అతిధి గృహం నిర్మించే స్థలానికి , తొట్ల కొండ కు సంబంధం లేదన్నారు. తొట్ల కొండకు, బావి కొండకు ..ప్రభుత్వ అతిధి గృహం నిర్మిద్దాం అనుకుంటున్న స్థలానికి కిలోమీటర్ దూరం ఉందని చెప్పారు. అది తెలియకుండా.. విమర్శలు చేయడం తగదన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios