క్రిఫ్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో మోసం: ఆవనిగడ్డలో రూ. 20 కోట్ల మోసం
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆవనిగడ్డలో క్రిఫ్టో కరెన్సీ పేరుతో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు.బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆవనిగడ్డ: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆవనిగడ్డలో క్రిఫ్టో కరెన్సీ పేరుతో పెట్టుబడులు పెట్టిన బాధితులు మోసపోయారు.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 3 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి రోజూ రూ. 7 వేలు చెల్లిస్తామని ప్రచారం చేయడంతో పలువురు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అయితే కొంతకాలంగా ఈ సంస్థ నుండి డబ్బులు రాకపోవడంతో మోసపోయిన భావించిన బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు.600 మంది ద్వారా సుమారు రూ. 20 కోట్లను వసూలు చేశారని పోలీసులు గుర్తించారు.
ట్రస్ట్ వాలెట్ యూకే అనే యాప్ ద్వారా డబ్బులు ఏజంట్లు కట్టించుకున్నారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై నుండి సెప్టెంబర్ వరకు యాప్ లో డబ్బులు చెల్లించారని ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా యాప్ పని చేయకపోవడంతో మోసపోయామని భావించిన బాధితులు స్పందనలో ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై పోలీసులు ఉన్నతాధికారులు ఆవనిగడ్డ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధితులు ఆవనిగడ్డ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషచయమై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆవనిగడ్డ పోలీసులు ప్రకటించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.