ప్రేమించానని... పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంట వచ్చిన యువతిని వ్యభిచారంలోకి దించాడు. విజయనగరానికి చెందిన చక్రధర్ ఓ ఆటోడ్రైవర్. తరచుగా తన ఆటో ఎక్కే ఢిల్లీకి చెందిన ఓ యువతితో చనువుగా ఉంటూ.. ఆమెను ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

నమ్మి వెంట వచ్చిన మహిళను ఓ ఇంట్లో పెట్టాడు.. అప్పటికే అక్కడున్న మరో ఇద్దరు మహిళలు తన బంధువులని నమ్మించాడు. కొన్ని రోజుల తర్వాత మరో మహిళను, బాలికను తీసుకొచ్చి అదే ఇంట్లో ఉంచాడు. ఈ క్రమంలో ఢిల్లీ యువతిని లోబరచుకుని ఆమెను అనుభవించాడు.

తనను పెళ్లి చేసుకోవాలని యువతి బలవంతం చేసింది. అయితే పెళ్లి చేసుకుంటా కానీ.. చెప్పిన చోటుకెళ్లి డబ్బు సంపాదించి తేవాలంటూ చెప్పడంతో ఆ యువతికి చక్రధర్ వ్యభిచార దందా తెలిసింది. పూర్తిగా అతని గుప్పిట్లోకి వెళ్లిపోవడంతో వ్యభిచారం ఊబిలోకి వెళ్లిపోయింది..

వాటిని భరించలేక, తప్పించుకోనులేక ఆ యువతి వాటిని మౌనంగానే భరించింది. ఈ క్రమంలో ఒకరోజు ఎలాగోలా తప్పించుకుని బయటపడి.. ఈ నెల 3న జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళ్తుండగా, రోడ్డు మీద స్పృహ తప్పిపడిపోయింది.. ఆస్పత్రిలో పోలీసులకు విషయం చెప్పింది.

ఈ ముఠా గుట్టును రట్టు చేసేందుకు పోలీసులు మారు వేషంలో విటులుగా వెళ్లారు. వారికి యువతులను పంపుతూ చక్రధర్ రెడ్ హ్యాండె‌డ్‌గా దొరికిపోయాడు. అతనిని అదుపులోకి తీసుకుని అతని వద్ద వున్న మహిళలను, మైనర్ బాలికను సంక్షేమ వసతి గృహానికి తరలించారు.