తిరుపతిలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ప్రయత్నించిన ఆటోడ్రైవర్‌ను చితకబాదారు స్థానికులు. నగర శివార్లలోని ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై మునీర్ భాషా అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేయబోయాడు.

దీనిని గమనించిన స్థానికులు అతనిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.