తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నించడం కలకలం రేపింది. ఈ ఘటన చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో చోటుచేసుకుంది. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నించడం కలకలం రేపింది. ఈ ఘటన చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో చోటుచేసుకుంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నించారు. వివరాలు.. సర్వే నంబర్ 222/5లో 87 సెంట్లు రిజిస్టర్ భూమిని నారా చంద్రబాబు నాయుడు తండ్రి నారా ఖర్జూర నాయుడు 1989‌లో కొనుగోలు చేశారు. అయితే తన వాటాగా వచ్చిన భూమిని చంద్రబాబు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, కళ్యాణమండపానికి వితరణగా ఇచ్చారు. 

అయితే మిగిలిన భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. మిగిలిన 38 సెంట్ల భూమి వారి పేరు మీద ఆన్​లైన్​లో నమోదు చేసుకోకపోవడంతో.. అదే అదనుగా భావించిన కొందరు కబ్జా చేసేందుకు యత్నించారు. చంద్రబాబుకు చెందిన 38సెంట్ల భూమిలో కబ్జాదారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. దీనిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే కబ్జాకు యత్నించిన మాత్రం ఇది తన భూమేనని వాదించాడు.

ఈ భూమికి సంబంధించి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పేరుపై రిజిస్ట్రేషన్ జరిగినా దాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో వివాదం తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చంద్రబాబు నాయుడు కుటుంబం స్పందించాల్సి ఉంది.