గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలొ టిడిపి దళిత కార్యకర్త వెంకటనారాయణ పై జరిగిన అమానుష దాడిని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య ఖండించారు.  

గుంటూరు: రాష్ట్రంలో గత రెండున్నరేళ్ల జగన్ రెడ్డి (ys jaganmohan reddy) పాలనలో వైసిపి (ycp) ముష్కర మూకల అకృత్యాలు అఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల (talibans) కంటే దారుణంగా మారాయని తెలుగుదేశం పార్టీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (varla ramaiah) ఆరోపించారు. గుంటూరు జిల్లా (guntur district) పెదనందిపాడు మండలం బోయపాలెం వద్ద దళితుడైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పొత్తూరి వెంకటనారాయణపై జరిగిన దాడిని వర్ల రామయ్య ఖండించారు. 

''ఒంటరిగా వున్న దళిత టిడిపి కార్యకర్త వెంకటనారాయణపై వైసిపికి చెందిన అసాంఘికశక్తులు గొడవపడి పెట్రోలు పోసి నిప్పంటించారు. రాష్ట్ర హోంమంత్రి సుచరిత (mekathoti sucharitha) సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనకు ఆమె ఏం సమాధానం చెబుతారు? హోంమంత్రి, డీజిపి goutham sawang ఈ ఘటనకు బాధ్యత వహించాలి. వెంకటనారాయణపై పైశాచికంగా హత్యాయత్నానికి పాల్పడిన వైసిపి గూండాలపై ఎస్సీ,ఎస్టీ చట్టం (sc,st act) కింద కేసులు నమోదుచేసి అరెస్ట్ చేయాలి'' అని వర్ల డిమాండ్ చేసారు. 

''నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ సంఘటనల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక గత 30నెలల్లో 29మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైసిపి గూండాలు పొట్టనబెట్టుకున్నారు, మరో 1480చోట్ల దాడులకు తెగబడ్డారు'' అని గుర్తుచేసారు.

read more చంద్రబాబును తిట్టొద్దంటే... మద్యం సీసాలతో తల పగలగొట్టి, నిప్పంటించి.. ఇంత ఘోరమా..: లోకేష్ సీరియస్ (Video)

''రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటకముందు డీజిపి గౌతం సవాంగ్ జోక్యం చేసుకుని వైసిపి అరాచకశక్తులను అదుపుచేయాలి, లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు డీజీపి, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది'' అని టిడిపి నేత వర్ల రామయ్య హెచ్చరించారు. 

తనపై ఎలా దాడి జరిగిందో బాధితుడు వెంకటనారాయణ వివరించాడు. తన అత్తగారి గ్రామమైన పెదకూరపాడు నుండి స్వగ్రామం కొప్పర్రు వెళుతూ మార్గమధ్యలో ఓ వైన్స్ మధ్య మద్యం తాగేందుకు ఆగినట్లు తెలిపాడు. మద్యం తీసుకుని వైన్స్ దగ్గర్లోనే తాగుతుండగా కొందరితో గొడవ జరిగినట్లు తెలిపాడు. మాటా మాటా పెరగడంతో వాళ్లు తనపై మద్యం బాటిల్స్ తో దాడి చేయడంతో పాటు పొదల్లో పడేసి నిప్పంటించి పడేసినట్లు బాధితుడు వివరించాడు. 

video

ఇదిలావుంటే సొంత వైసిపి పార్టీకి చెందిన నాయకుడిపైనే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులు దారుణంగా దాడికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు తీరువల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటూ ఇటీవల బాలినేని పుట్టినరోజున జరిగిన ఓ కార్యక్రమంలో వైసిపి నేత సుబ్బారావు గుప్త సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

ఈ నేపథ్యంలోనే అతడి ఇంటిపై శనివారం కొందరు దాడికి పాల్పడగా ప్రాణభయంతో సుబ్బారావు ఓ లాడ్జిలో తలదాచుకున్నాడు. ఆదివారం అతడి ఆఛూకీ కనుక్కున్న మంత్రి బాలినేని అనుచరుడు సుభానీ గ్యాంగ్ తో వెళ్లి దాడికి పాల్పడ్డాడు. సుబ్బారావును సుభానీ బూతులు తిడుతూ దాడిచేయడమే కాదు దీన్నంతా వీడియో తీయించుకున్నాడు. ఈ వీడియో బయటకు లీక్ అయి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.