Asianet News TeluguAsianet News Telugu

రైనా మేనత్త కుటుంబంపై దాడి: వీడిన మిస్టరీ.... స్వయంగా ప్రకటించిన పంజాబ్ సీఎం

భారతదేశంతో పాటు ప్రపంచ క్రికెట్‌లో సంచలనం సృష్టించిన టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మేనత్త కుటుంబంపై దాడి కేసును పంజాబ్ పోలీసులు చేధించారు. 

Attack on Suresh Raina's relatives: murder case solved, says Punjab CM
Author
Chandigarh, First Published Sep 16, 2020, 3:50 PM IST

భారతదేశంతో పాటు ప్రపంచ క్రికెట్‌లో సంచలనం సృష్టించిన టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మేనత్త కుటుంబంపై దాడి కేసును పంజాబ్ పోలీసులు చేధించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ప్రకటించారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేసులో మరో 11 మందిని అరెస్ట్ చేయాల్సి వుందని పంజాబ్ డీజీపీ దినకర్‌ గుప్తా  వెల్లడించారు.

గత నెల 19న రాత్రి సమయంలో పఠాన్‌కోట్ జిల్లాలోని థర్యాల్ గ్రామంలో.. డాబా మీద నిద్రిస్తోన్న రైనా మేనత్త కుటుంబంపై దాడి జరిగింది. ఈ దాడిలో రైనా మేనత్త భర్త, కాంట్రాక్టర్ అయిన అశోక్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

కొద్ది రోజుల అనంతరం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ రైనా కజిన్ కౌశల్ కుమార్ కూడా చనిపోయాడు. క్రికెటర్ మేనత్త ఆశారాణి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిలో గాయపడిన మరో ఇద్దరు కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

సురేశ్ రైనా యూఏఈ నుంచి భారత్ తిరిగొచ్చిన తర్వాత ఈ దాడి విషయం వెలుగు చూసింది. తమ మేనత్త కుటుంబంపై ఇంతటి తీవ్రమైన దాడికి పాల్పడిన దోషులను గుర్తించాలని పంజాబ్ సీఎంను రైనా కోరాడు. స్పందించిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios