Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాకుళంలో బుద్దుడి విగ్రహం ధ్వంసం.. నెలరోజుల్లో రెండోసారి !

ఆంధ్రప్రదేశ్ లో రోజుకో ఆలయంలో విగ్రహాల ధ్వంసం కలకలం రేపుతోంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటున్నా ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుద్ధుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రెండోసారి ధ్వంసం చేశారు. 

attack on buddha statue in srikakulam - bsb
Author
Hyderabad, First Published Jan 4, 2021, 9:57 AM IST

ఆంధ్రప్రదేశ్ లో రోజుకో ఆలయంలో విగ్రహాల ధ్వంసం కలకలం రేపుతోంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటున్నా ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుద్ధుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రెండోసారి ధ్వంసం చేశారు. 

నెలరోజుల కిందట ఇదే విగ్రహ చేతిని ధ్వంసం చేశారు. ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచి నీటి పథకం పక్కనున్న గార్డెన్ లో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు, తెలుగుతల్లి విగ్రహాలతో పాటు బుద్ధుని విగ్రహం ఉంది. ఈ విగ్రం కుడి చేతి భాగాన్ని నెల రోజుల కిందట గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. 

ఇది గుర్తించిన అధికారులు శిల్పి సాయంతో కొత్త చేతిని పెట్టించారు. అయితే తిరిగి ఆదివారం నాటికి బుద్ధుని చేయి భాగాన్ని ఎవరో మళ్లీ విరగ్గొట్టారు. ఆకతాయిల పనిగా అధికారులు భావిస్తున్నారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పార్కును పర్యవేక్షిస్తున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈ రాజు తెలిపారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios