చిత్తూరు: అంతర్వేది రధం దగ్దం ఘటన మొదలు రాష్ట్రంలో ఎదో ఒకచోట హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు కొనసాగుతూనే వున్నాయి. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలోని గంగాధనెల్లూరు మండలం అగరమంగళంలోని ఓ దేవాలయంలో నంది విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దాడి చేసి ధ్వంసం చేశారు. గుడిలోంచి విగ్రహాన్ని బయటకు తీసుకువచ్చి మరీ ధ్వంసం చేశారు దుండగులు. 

అగర మంగళంలోని అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో శివాలయం ఎదుట నంది విగ్రహం వుంది. ఈ విగ్రహాన్ని అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆలయంలోంచి పెకిలించి బయటకు తీసుకువచ్చారు. ఇలా ఆ విగ్రహాన్ని ఆలయం వెనకకు తీసుకెళ్లి ధ్వంసం చేశారు. 

ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆలయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్వయంగా జిల్లా ఎస్పి సెంథిల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నంది విగ్రహం ధ్వంసం కేసును మూడు బృందాల ద్వారా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. 

read more   హిందూ దేవాలయాలపై ఆగని దాడులు...ఈసారి కాలభైరవ విగ్రహం ధ్వంసం

ఇటీవల కృష్ణా జిల్లాలో ఓ పురాతన దేవాలయంలోని నంది విగ్రహాన్ని అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గరలో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరగ్గొట్టారు. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ చెయి విరగగొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

read more   అంతర్వేది నూతన రధ నమూనాను పరిశీలించిన స్వరూపానందేంద్ర...పలు సూచనలు (వీడియో)

 అంతర్వేదిలో ఘటనను ఇంకా పూర్తి స్థాయిలో మరువక ముందే ఇలాంటి వరుస సంఘటనలు భక్తులను కలవరానికి గురిచేస్తున్నాయి. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఓ ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. షిర్డీ సాయిబాబా మందిరం వద్ద బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేయగా ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బిజెపి, జనసేన, టిడిపి పార్టీలు ఈ దాడులను నిరిసిస్తూ నిరసన బాట పట్టాయి. ఇలా హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు ఏపీ రాజకీయాలనూ వేడెక్కిస్తున్నాయి.