గంజాయి తాగి ఓ యువకుడు ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు లో చోటు చేసుకుంది. నిందితుడిని స్థానికులు చితకబాదారు. పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ యువకుడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఆ మత్తులో ఓ దారుణానికి ఒడిగట్టాడు. ఆరేళ్ల బాలుడు అని కూడా చూడకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలుడిని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రక్కు..10 మంది దుర్మరణం..
వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని పొన్నూరు పట్టణానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడు ఓ ప్రైవేట్ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం స్కూల్ కు వెళ్లాడు. తిరిగి వచ్చిన తరువాత ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో 20 ఏళ్ల నాగిశెట్టి పవన్ ఆ ఇంటి దిక్కు వచ్చాడు.
ముగిసిన పార్లమెంటు సమావేశాలు.. 20 బిల్లులకు ఆమోదం: లోక్ సభ స్పీకర్
ఒంటరిగా ఆడుకుంటున్న బాలుడిని చూసి అతడికి దుర్భద్ధి కలిగింది. అప్పటికే అతడు ఫుల్లుగా గంజాయి తాగి ఉన్నాడు. ఆ మత్తులోనే బాలుడిని అఘాయిత్యం చేయాలనే కోరిక కలిగింది. ఆ ఇంట్లోని ఓ గదిలోకి బాలుడిని లాక్కెళ్లాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బ్యాలెట్ ఎన్నికల విధానం పునరుద్ధరించడంపై కేంద్రం స్పష్టీకరణ.. ఏమన్నదంటే?
బాధితుడు కేకలు వేడయంతో స్థానికులు విని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. నిందితుడిని బయటకు తీసుకొచ్చి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
