నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ టౌనింగ్ ప్లానింగ్ అధికారి సునీల్ రాజు ఏకంగా కార్యాలయంలోనే యువతితో సరస సల్లాపాల్లో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఆఫీస్ మిడ్ డే మసాలా సీన్‌కు అడ్డాగా మారింది. పట్టపగలే ఓ అధికారి బరి తెగించి రాసలీలలు సాగించారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సునీల్ రాజు.. ఓ యువతితో సరస సల్లాపాల్లో మునిగిపోయాడు. ఎవరైనా చూస్తారన్న భయం లేదు .. చూస్తే ఏమవుతుందున్న సోయా లేదు . ఆఫీస్‌ను సొంత బెడ్‌రూమ్‌గా మార్చేశాడు. ఆ అధికారి కామ క్రీడలు రహస్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆత్మకూరు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ రాజు వ్యవహారంపై అధికారులు స్పందించారు. వీడియోలో అయ్యగారి రొమాన్స్ స్పష్టంగా కనిపిస్తూ వుండటంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గతంలోనూ ఇలాగే కార్యాలయానికి సంబంధం లేని యువతిని ఆఫీసుకు తీసుకొచ్చారన్న ఆరోపణలు వున్నాయి. మహిళా ఉద్యోగులను వేధించారని కూడా అభియోగాలు వున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.