అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు కోరనావైరస్ ప్రభావం కారణమని అనుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఇలాంటి ఎన్నికలు ఎందుకు, రద్దు చేస్తేనే మంచిదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన అన్నారు. ఎన్నికలను వాయిదా వేయడం కాదు, రద్దు చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు దారుణంగా జరిగాయని ఆయన అన్నారు. 

Also Read: ఏపీ స్థానిక ఎన్నికలపై ఈసీ కొరడా: జగన్ కు షాక్, చంద్రబాబుకు ఊరట

మాచర్ల ఘటనపై తాము కోర్టుకును ఆశ్రయిస్తామని టీడీపీ నేత బొండా ఉమామేహశ్వర రావు చెప్పారు. దాడి చేసినవారిని వదిలేసి డీజీపీ తమను విచారిస్తున్నారని ఆయన ఆదివారంనాడు అన్నారు. మాచర్లలో తమన చంపడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. ఏపీ బీహార్ ను తలపిస్తోందని వ్యాఖ్యానించారు. కోర్టు ద్వారానే న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. 

మాచర్ల ఘటనపై 72 గంటలు నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యే విజయవాడ వచ్చి చంపుతామని బెదిరించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సిబీఐ విచారణ కోరిందని ఆయన చెప్పారు. 

Also Read: కరోనా దెబ్బ: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

మాచర్ల ఘటనలో అసలు దోషులు బయటకు రావాలని ఉమా అన్నారు. కోర్టును అశ్రయించి అవసరమైతే సీబీఐ విచారణ కోరుతామని ఆయన చెప్పారు.