ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి మనం చూసాము. టీవీల్లో కంపడేంత స్థాయిలో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతూ ఎన్నికలను ఒక సంగ్రామంగా మార్చారు. 

ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలను చాలా సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ విషయంపై స్పందిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. అభ్యర్థులు శాంతియుత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనలేకుండా ఇలా భయభ్రాంతులకు వారిని గురి చేయడం వాంఛనీయం కాదని ఆయన అసహనం వ్యక్తం చేసారు. 

Also read: కరోనా దెబ్బ: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

ప్రచార మాధ్యమాల ద్వారా, తమకందిన ఫిర్యాదుల ద్వారా సేకరించిన సమాచారం మేరకు చాలా చోట్ల ఇలాంటి హిమసాత్మక ఘటనలు సాధారణ ప్రజలను కూడా భయభ్రఅంథులకు కూడా గురి చేసేవిలా ఉన్నాయని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నికల ప్రక్రియనూయి అపహాస్యం చేసినట్టవుతుందని ఆయన అన్నారు. 

చాలా చోట్ల అధికార యంత్రంగం పూర్తిగా పక్షపాత ధోరణితో హింసాత్మక సంఘటనలను అడ్డుకోకపోవడం, ఉదాసీన వైఖరి తో వ్యవహరించడం, ప్రేక్షక పాత్ర పోషించడం చాలా శోచనీయం అని అన్నారు. 

ఇటువంటి హింసాత్మక సంఘటనలు అత్యధికంగా జరిగిన చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను తక్షణం ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రాష్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. 

మాచర్లలో జరిగిన హింసాత్మక సంఘటనలో దాడి చేజేసిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం గర్హనీయమని, దానికి సిఐ బాధ్యత వహించాలని, తక్షణం ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. 

వీరితోపాటు కాళహస్తి, పలమనేరు డిఎస్పీలను, తిరుపతి, పలమనేరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐ లను ఎన్నికల విధుల  నుంచి తప్పిస్తున్నట్టు తెలిపింది. 

ఇలా అధికారులపై చర్యలు తీసుకుంటే... మలిదఫా ఎన్నికల్లో వారు తమ బాధ్యతను ఎరిగి నడుచుకుంటారని ఆయన అన్నారు. 

తిరుపతి, మాచర్ల, పుంగనూరులో జరిగిన ఎన్నికల ప్రక్రియను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైన చోట అక్కడ ఉప ఎన్నికను కూడా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేసారు. 

ముఖ్యంగా మహిళలు, బలహీన వర్గాలపై జరిగిన దాడులు అవాంఛనీయమని, చాలా శోచనీయమని ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ అన్నారు. 

ఈ ప్రకటన చేసేకన్నా ముందు కరోనా వైరస్ వల్ల స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రమేష్ కుమార్ తెలిపారు. ఈ మహమ్మారి ప్రబలంగా పంజా విసురుతున్న సమయంలో ఎన్నికలను నిర్వహించడం తగదని, అందుకే వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.