అమరావతి: వైసిపి ఓటేసి ఎవరయితే జగన్ ను సీఎం చేశారో అదే వర్గాలపైనే ఇప్పుడు దాడులు జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనారిటీలపై జరిగిన దాడులకు నిరసనగా నేడు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చామని... ఆ వర్గాలపై అధికార పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే వాయిదా తీర్మానాన్ని అనుమతించి చర్చించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 

''బీసీలుగా పుట్టడం నేను, కొల్లు రవీంద్ర చేసిన తప్పా. అందుకే మా మీద కేస్ లు పెట్టారా?'' అని ప్రభుత్వాన్ని నిలదీశారు. తాము ఏ తప్పూ చేయకున్నా కావాలనే కేసుల్లో ఇరికించి కక్షసాధింపు చర్యలకు దిగినట్లు అచ్చెన్న ఆరోపించారు. 

''అసెంబ్లీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని దాచిపెట్టడానిక మీరు కొన్ని మీడియాలను ను బంద్ చేస్తారా...? ముఖ్యమంత్రి మట్లాడితేనే లైవ్ వస్తోంది కానీ ప్రతిపక్ష నేత, సభ్యులు మటాడినప్పుడు లైవ్ కనపడనివ్వడం లేదు. శాసన సభలో ప్రజా సమస్యలపై జరిగే చర్చలు తెలియకుండా కొన్ని మీడియాలను నియంత్రిస్తున్నారు. మీడియా సంస్థలు అన్నింటికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం'' అని అన్నారు. 

read more  నల్ల బ్యాడ్జీలు, చేతులకు సంకెళ్లు: లోకేష్ వినూత్న నిరసన

''తాము ఇవాళ సలాం కుటుంబం ఆత్మహత్య, డాక్టర్ సుధాకర్ సహా దళితులపై జరుగుతున్న దాడులపై వాయిదా తీర్మానం ఇచ్చాం. వాటిని అనుమతించి చర్చించాలి'' అని కోరారు. 

''కోవిడ్ ప్రపంచాన్ని వణికిస్తున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సేవలు చేస్తే ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామన్నారు. దీంతో చాలామంది డాక్టర్లు, నర్సులతో పాటు ఇతర వైద్యసిబ్బంది ఔట్ సోర్సింగ్ లో పనిచేశారు. ఇప్పుడు వీరి సేవలు చాలంటూ ఉత్తర్వులు ఇచ్చారు.  ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వీరి సేవలను కొనసాగించాలని డిమాండ్ చెస్తున్నాం'' అన్నారు. 

మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ... వైసిపి సర్కార్ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని కక్ష సాధింపు, కౌంటర్ కేస్ లు పెడుతున్నారని మండిపడ్డారు. రైతులు మీద దాడులు, ఎస్సీ, ఎస్టి, మైనార్టీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. సలాం కుటుంబం ఆత్మహత్య కు పై ప్రభుత్వ స్పందనకు నిరసనగా ముస్లిం నాయకులు ఛలో అసెంబ్లీ కి పిలుపునిస్తే వారిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారుని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేయడం లేదని చినరాజప్ప విరుచుకుపడ్డారు.