Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుపై దాడి .. ఎన్‌ఎస్జీ కమాండోలను రెచ్చగొట్టి, కాల్పులు జరగాలన్నదే వైసీపీ ప్లాన్ : అచ్చెన్నాయుడు

యర్రగొండపాలెంలో ఎన్ఎస్జీ కమాండోలపై రాళ్లు విసిరి, వారిని రెచ్చగొట్టి .. దళితులపై కాల్పులు జరిపేలా చేసి తద్వారా టీడీపీపై బురద జల్లేలా కుట్ర చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు కాన్వాయ్ ఎటువైపు నుంచి వస్తుందో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రతిక్షణం పోలీసుల నుంచి తెలుసుకున్నారని పేర్కొన్నారు. 

atchannaidu sensational comments on ysrcp over attack on tdp chief chandrababu naidu at yerragondapalem ksp
Author
First Published Apr 22, 2023, 2:39 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో దాడి జరిగిన ఘటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై దాడి వెనుక జగన్, వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వున్నారని ఆరోపించారు. వారి కుట్రలో భాగంగానే అఈ దాడి జరిగిందని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు పర్యటనల్లో దాడులు చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని తాము కడప, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలతో పాటు డీజీపీకి లేఖ రాశామని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. అయినప్పటికీ చంద్రబాబుపై దాడి జరిగిందంటే పోలీసులు,  వైసీపీ నేతలు కలిసి చేసిన కుట్రేనని ఆయన ఆరోపించారు. విపక్షనేతకు భద్రత కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read: చంద్రబాబు నాయుడి వాహనంపై రాళ్ల దాడి.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డుపెట్టి రక్షణ కల్పించిన భద్రతా సిబ్బంది

ఎన్ఎస్జీ కమాండోలపై రాళ్లు విసిరి, వారిని రెచ్చగొట్టి .. దళితులపై కాల్పులు జరిపేలా చేసి తద్వారా టీడీపీపై బురద జల్లేలా కుట్ర చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కితే బారికేడ్లు పెట్టి ప్రజల్ని కూడా రోడ్డెక్కనివ్వకుండా.. విపక్ష నేతల్ని గృహ నిర్బంధాలు చేసే పోలీసులు.. చంద్రబాబు వస్తుంటే మాత్రం రౌడీలకు అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. దీని వెనుక జగన్ ఆదేశాలు వున్నాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు కాన్వాయ్ ఎటువైపు నుంచి వస్తుందో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రతిక్షణం పోలీసుల నుంచి తెలుసుకున్నారని.. దీనిని బట్టి దాడికి ముందుగానే ప్లాన్ జరిగినట్లు అర్ధమవుతోందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios