Asianet News TeluguAsianet News Telugu

జైలుకి అచ్చెన్నాయుడు: ఖైదీ నెంబర్ 1573

టీడీపీ సీనియర్ నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని నేడు ఆసుపత్రి నుండి విడుదల చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆయన ఇందాకటి కొద్దిసేపటి కింద విజయవాడ సబ్ జైలుకు చేరుకున్నారు

Atchannaidu Allotted number 1573
Author
Vijayawada, First Published Jul 1, 2020, 9:10 PM IST

టీడీపీ సీనియర్ నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని నేడు ఆసుపత్రి నుండి విడుదల చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆయన ఇందాకటి కొద్దిసేపటి కింద విజయవాడ సబ్ జైలుకు చేరుకున్నారు. ఆయనకు ఖైదీ నెంబర్ 1573 ని కేటాయించారు. 

ఇకపోతే... రేపు బెయిల్ వస్తుందనగా ఇంత అత్యవసరంగా సాయంత్రం పూట ఎందుకు జైలుకు తరలించాల్సి వచ్చిందని టీడీపీ వారు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇంకా పూర్తిగా అనారోగ్యం నుంచి కోలుకోకున్నప్పటికీ... అంబులెన్సులో ఎందుకు తరలించారు అని ప్రశ్నిస్తున్నారు. 

ఇకపోతే... కక్షసాధింపు చర్యలలో భాగంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసిన ప్రభుత్వం ఒక్కరోజైనా ఆయన్ను జైల్లో పెట్టాలనే ఎత్తుగడతో కుట్రపూరితంగా, నిబంధనలకు వ్యతిరేకంగా, బలవంతంగా జీజిహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసిందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

అచ్చెన్నాయుడి బెయిల్ పిటీషన్ వాదనలు ముగిసిన నేపధ్యంలో  ఏసీబి కోర్టు తీర్పు ఇవ్వనుందని, ఆ తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే అనుమానంతో ఒక్క రోజైనా అచ్చెన్నాయుడ్ని జైల్లో పెట్టి తన పంతం నెరవేర్చుకునే దిశగా వైకాపా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని అన్నారు. ఆంటే టైమ్ వేసి అచ్చెన్నాయుడ్ని డిశ్చార్జ్ చేయడం దుర్మార్గం అని, కమిటీ పేరుతో డాక్టర్స్ డే రోజున తప్పుడు నివేదికలతో, ప్రభుత్వ ఒత్తిళ్ళతో అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం అడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

ఇప్పటికే అచ్చెన్నాయుడి అరెస్టు లో రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చేస్తున్న ప్రతి తప్పుకి వైకాపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గద్దె ప్రకటనలో పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios