డిసెంబర్ 23న మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆశోక్ గజపతిరాజు పై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రామతీర్థంలోని బోడికొండపై శ్రీ కోదండ రామాలయం శంకుస్థాపన సమయంలో విధులకు ఆటంకం కల్గించారని ఆలయ ఈఓ నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయనగరం : Ramatirtham, రగడ మీద మాజీ కేంద్ర మంత్రి Ashok Gajapatiraju హైకోర్టును ఆశ్రయించారు. నెల్లిమర్ల పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ హై కోర్టులో అశోక్ గజపతిరాజు పిటిషన్ వేశారు. పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కాగా, డిసెంబర్ 23న మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆశోక్ గజపతిరాజు పై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రామతీర్థంలోని బోడికొండపై శ్రీ కోదండ రామాలయం శంకుస్థాపన సమయంలో విధులకు ఆటంకం కల్గించారని ఆలయ ఈఓ నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ ఆశోక్ గజపతిరాజుపై 473, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.Ramatheertham బోడికొండపై శ్రీరాముడి విగ్రహం గత ఏడాది క్రితం ధ్వంసమైంది. అయితే ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈ నెల 22 కోదండరామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమం గురించి ఆలయ ధర్మకర్తనైనా తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు తీవ్రంగా మండిపడ్డారు. ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు హాజరు కావడానికి ముందే బోడికొండ వద్దకు అనుచరులతో చేరుకొన్న ఆశోక్ గజపతిరాజు నిరసనకు దిగారు. ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని పక్కకు తోసేశారు.
కక్షతోనే నాపై కేసులు: వైసీపీ సర్కార్ పై ఆశోక్ గజపతి రాజు
ఈ సమయంలో పోలీసులు, అధికారులు Ashok Gajapathi Raju ను అడ్డుకొన్నారు. ఈ సమయంలో అధికారులతో ఆశోక్ గజపతిరాజుకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసకొంది. అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. తమాషా చేస్తున్నారు, సర్కస్ చేస్తున్నారని ఆశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్య క్తం చేశారు.శంకుస్థాపన స్థలంలోనే బైఠాయించి నిరసనకు దిగారు. అయితే ఈ సమయంలో అధికారులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి,ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి Botsa Satyanarayana,ఏపీ దేవాదాయ శాఖ మంత్రి Vellampalli Srinivas, ycp నేతలు అక్కడికి చేరుకొన్నారు. ఆలయానికి శంకుస్థాపన చేసే సమయంలో సర్కస్ చేస్తున్నారంటూ మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడొద్దని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యంతరం చెప్పారు.
కుప్పంలో టిడిపి కార్యకర్త కిడ్నాప్, చంపేస్తామని వార్నింగ్... రక్షించాలంటూ డిజిపికి చంద్రబాబు లేఖ
సర్కస్ చేస్తున్నారని మరోసారి రెట్టించి వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు. శంకుస్థాపన సందర్భంగా కొబ్బరికాయ కూడా కొట్టకుండా తనను మంత్రులు అడ్డుకొన్నారని మాజీకేంద్ర మంత్రి ఆశోకో్ గజపతి రాజు మీడియాకు చెప్పారు. ఆలయ సంస్కృతి, సంప్రదాయాలను అధికార పార్టీ విస్మరించిందని ఆయన మండిపడ్డారు.
