సంచయిత గజపతి రాజు ఈమె మాన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా అనూహ్యంగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆమె బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఏదో వివాదం రాజుకుంటూనే ఉంది. బాబాయ్ అశోక్ గజపతిరాజుపై సంచయిత విమర్శలు చేస్తూనే వున్నారు. తాజాగా శుక్రవారం వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. 

సంచయిత గజపతి రాజు ఈమె మాన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా అనూహ్యంగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆమె బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఏదో వివాదం రాజుకుంటూనే ఉంది. బాబాయ్ అశోక్ గజపతిరాజుపై సంచయిత విమర్శలు చేస్తూనే వున్నారు. తాజాగా శుక్రవారం వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎం.ఆర్‌. కాలేజీ గురించి అశోక్ గజపతి రాజు చేస్తున్న తప్పుడు సమాచారం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఆయన ఇంతగా దిగజారి మాట్లాడతారని ఊహించలేదని సంచయిత పేర్కొన్నారు. ఎం.ఆర్‌. కాలేజీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రయివేటు కాలేజీ అని ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు. 

Scroll to load tweet…

కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఎయిడెడ్‌ హోదాను 2017లో ఆయనే సరెండర్‌ చేశారని సంచయిత గుర్తుచేశారు. అప్పుడు తీసుకున్న విధాన నిర్ణయం కొనసాగుతోందని ఇందులో ప్రభుత్వం జోక్యం కాని, సంబంధం కాని లేదని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ఆయన విస్మరించి మాట్లాడుతున్నారని.. దయచేసి మీ రాజకీయాల్లోకి మాన్సాస్‌ విద్యాసంస్థలను లాగవద్దని సంచయిత విజ్ఞప్తి చేశారు. 

Scroll to load tweet…

అశోక్‌ మాన్సాస్‌ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తప్పుడు వివరాలు ఇవ్వటం వల్లన మాన్సాస్‌ కాలేజీలకు రూ.6.5 కోట్లు నష్టం వచ్చిందని ఆమె చెప్పారు. అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అశోక్‌ డిస్కౌంట్‌గా ఈ డబ్బు ఇచ్చారేమోనని సంచయిత ఆరోపించారు. అందుకే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నుంచి ఈ డబ్బును తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

Scroll to load tweet…

సరైన అనుమతులు లేని కారణంగా 2018–2020లో 170 మంది విద్యార్థులకు ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటుకాకుండా పోయాయని సంచయిత ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ గజపతి రాజు విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకున్నారని, వారి జీవితాలను చీకట్లోకి నెట్టేశారు. తాను బాధ్యతలు వచ్చాకా ఈ సమస్యపై దృష్టిపెట్టానని ఆమె తెలిపారు. 

Scroll to load tweet…

అశోక్‌ తన రాజకీయ ఆటల కోసం విజయనగరం పెద్దల వారసత్వాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ఆమె కోరారు. కనీసం గాంధీ జయంతి రోజైనా అశోక్ నిజాలు మాట్లాడాలని సంచయిత డిమాండ్ చేశారు. 

Scroll to load tweet…