ఏడు మాసాలుగా ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని  ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేయాలని  ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ ఆశా వర్కర్లను ఆదుకొంటామని ఇచ్చిన హామీని  అమలు చేయాలని ఆశా వర్కర్లను డిమాండ్ చేస్తున్నారు.తమ డిమాండ్ల సాధన కోసం ఛలో విజయవాడకు ఆశా వర్కర్లు పిలుపు ఇచ్చారు.  ఛలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లున్న ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకొంటున్నారని ఆ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రతి నెల రూ. 10వేల వేతనం చెల్లించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఏడు మాసాలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కూడ ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.