చిత్తూరు: చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబుకు షాక్ ఇచ్చింది ఒంగోలు సంచార న్యాయ స్థానం. ఎం.ఎస్ బాబుకు అరెస్టు వారెంట్‌ జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  
చెల్లని చెక్కు కేసులో వాయిదాకు హాజరు కానందున ఆయనకు న్యాయస్థానం వారెంట్‌ జారీచేసింది. 

ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ క ావడంతో ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చక్కుల బౌన్స్ కేసు విచారణ జరుగుతోంది. అయితే కేసు విచారణకు ఎమ్మెల్యే గైర్హాజరుకావడంతో ఒంగోలు  సంచార న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.