Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలో దర్శనానికి బ్లాక్ టికెట్లు విక్ర‌యిస్తున్న వ్య‌క్తుల‌ అరెస్ట్..

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో భక్తుల‌కు శ్రీవారి ద‌ర్శనం కోసం బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వారిని పోలీసులు శుక్ర‌వారం అరెస్టు చేశారు. ఇందులో ఓ డ్రైవర్ తో పాటు మ‌రో ఇద్ద‌రు బ్రోక‌ర్లు ఉన్నారు. 

Arrest of persons selling black tickets for darshan in Thirumala ..
Author
Tirumala, First Published Jan 29, 2022, 12:25 PM IST

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో భక్తుల‌కు శ్రీవారి ద‌ర్శనం కోసం బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వారిని పోలీసులు శుక్ర‌వారం అరెస్టు చేశారు. ఇందులో ఓ డ్రైవర్ తో పాటు మ‌రో ఇద్ద‌రు బ్రోక‌ర్లు ఉన్నారు. టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ ప్ర‌కారం.. సీ. సుబ్రమణ్యంతో పాటు అత‌ని ముగ్గురు స్నేహితులు తిరుమ‌ల‌లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి నిరాకరించారు, త‌మ వ‌ద్ద రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు ఉన్నాయ‌ని చెప్పారు. అయితే వీటిని ప‌రిశీలించిన విజిలెన్స్, సెక్యూరిటీ వింగ్ అధికారులు ఆ టిక్కెట్లు న‌కిలీవ‌ని గుర్తించారు. 

దీంతో అమాయ‌కుల‌మ‌ని, త‌మ‌కేమీ తెల‌య‌ద‌ని ఆ ముగ్గురు భ‌క్తులు అధికారుల‌తో చెప్పారు. ఓ ఆటో డ్రైవ‌ర్ ఆటో డ్రైవర్‌ మౌనకుమార్‌, అతని స్నేహితుడు సౌందర్‌ నుంచి మూడు టిక్కెట్లు కొనుగోలు చేశామ‌ని తెలిపారు. వాటి కోసం తాము రూ.8000 చెల్లించామ‌ని అన్నారు. తాము మోసపోయామని తెలియదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో అధికారుల‌కు భ‌క్తులు మోస‌పోయార‌ని అర్థం అయ్యింది. బ్రోకర్లు అసలు టిక్కెట్లకు బదులు నకిలీ దర్శనం టిక్కెట్లు ఇచ్చార‌ని గ్ర‌హించారు. 

త‌రువాత టీటీడీ విజిలెన్స్. భద్రతా విభాగం అధికారులు ఆ భ‌క్తుల‌ను తిరుమల పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ భ‌క్తులు న‌కిలీ టిక్కెట్ల విష‌యంలో అధికారికంగా స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మోస‌గాళ్ల‌పై పోలీసులు సెక్షన్ 420, 468 R / W34 IPC కింద కేసు నమోదు చేశారు. అనంత‌రం బ్రోకర్లిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

దర్శన టిక్కెట్ల కోసం భక్తులు దళారులు, మధ్యవర్తుల వద్దకు వెళ్లవద్దని టీటీడీ సీవీఎస్‌వో గోపీనాథ్‌ జట్టి  భక్తులకు విజ్ఞప్తి చేశారు.భక్తులు ఎల్లప్పుడూ TTD అధికారిక వెబ్‌సైట్ ద్వారా కానీ, లేకపోతే TTD దర్శన టికెట్ జారీ చేసే కౌంటర్ల ద్వారా మాత్రమే వారి టిక్కెట్లు కొనుగోలు చేయాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడకూడదని టాక్సీ, ఆటో డ్రైవర్‌లను హెచ్చరించారు. ఇలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్‌లు సీజ్ చేస్తామ‌ని అన్నారు. దీంతో పాటు వారిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios