టిడిపిలో 50 మంది సిట్టింగులకు నో ఛాన్స్ ?

Around 50 tdp mlas may not getting chance to contest again
Highlights

  • టిడిపి సిట్టింగ్ ఎంఎల్ఏల్లో చాలామందికి వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేసే అవకాశం లేదని సమాచారం.
  • కొద్ది రోజులుగా నియోజకవర్గాల వారీగా చేయిస్తున్న సర్వేల ఆధారంగా ఎవరెవరికి టిక్కెట్లను నిరాకరించాలో కుడా చంద్రబాబు నిర్ణయించేసారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.
  • పనితీరు బాగోలేకపోవటం, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం తదితర అంశాల ప్రాతిపదికగా చంద్రబాబు సర్వేలు చేయిస్తున్నారు.
  • అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటికే అనేకమార్లు ఎంఎల్ఏలపై అంశాల వారీగా తరచూ సర్వేలు చేయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కదా?

టిడిపి సిట్టింగ్ ఎంఎల్ఏల్లో చాలామందికి వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేసే అవకాశం లేదని సమాచారం. కొద్ది రోజులుగా నియోజకవర్గాల వారీగా చేయిస్తున్న సర్వేల ఆధారంగా ఎవరెవరికి టిక్కెట్లను నిరాకరించాలో కుడా చంద్రబాబు నిర్ణయించేసారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. పనితీరు బాగోలేకపోవటం, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం తదితర అంశాల ప్రాతిపదికగా చంద్రబాబు సర్వేలు చేయిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటికే అనేకమార్లు ఎంఎల్ఏలపై అంశాల వారీగా తరచూ సర్వేలు చేయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కదా?

కొద్ది రోజులుగా చంద్రబాబు తరచూ ముందస్తు ఎన్నికల గురిచి ప్రవచిస్తున్నారు. అందులో భాగంగానే సర్వేల జోరు కుడా పెంచారట. సోమ, మంగళవారాల్లో జరిగిన పార్టీ నేతల సమావేశాల్లో కుడా 2018 చివరి నాటికే ఎన్నికలు వస్తాయని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో ఎవరిని పక్కకు పెట్టాలి, ఎవరికి టిక్కట్లు ఇవ్వాలన్న విషయంలో చంద్రబాబు నిర్ణయానికి వచ్చారట. మొత్తం మీద సుమారు 30 మందికి టిక్కెట్లు దక్కే అవకాశం లేదని ప్రచారం ఊపందుకున్నది. దానికితోడు జనసేన, భారతీయ జనతా పార్టీలతో గనుక పొత్తులుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

ఎందుకంటే, పై కారణాలతో పోటీచేసే అవకాశం రానివారితో పాటు భాజపా, జనసేనతో పొత్తులుంటే వారికి కొన్ని సీట్లను కేటాయించాలి కదా? కాబట్టి మరికొందరు ఎంఎల్ఏలకు పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ లెక్కన సుమారు 50 మంది ఎంఎల్ఏలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోయినా ఆశ్చర్యం లేదని సమాచారం. ఇదే పద్దతి ఎంపి సీట్లకు కుడా వర్తిస్తుంది. మరి, ఎంతమంది సిట్టింగు ఎంపిలకు కోత పడుతుందో చూడాలి.

 

loader