ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా వున్న 1,326 ఉద్యోగాలకు ఏపిపిఎస్సి ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తంగా వివిధ విబాగాలకు సంబంధించిన ఖాళీలకు సంబంధించి వేరువేరుగా ఏడు నోటిఫికేషన్లు జారీ చేసింది. 

గ్రూప్ 1, గ్రూప్ 2 తో పాటు డిగ్రీ కాలేజ్ లెక్చరర్, ఫిషరీస్, ఇన్పర్మేషన్ సర్వీస్ శాఖల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గ్రూప్- 1లో 169, గ్రూప్-2లో 446, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 305 లెక్చరర్ పోస్టులు, ఫిషరీస్ సబ్ సర్వీస్ లో 10 అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్, న్ఫర్మేషన్ సర్వీస్ లో 5 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.  

గ్రూప్ -1 పోస్టులకు జనవరి 7 నుంచి 28 వరకు, గ్రూప్ 2 పోస్టులకు జనవరి 10 నుంచి 31 వరకు, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులకు ఫిబ్రవరి 5 నుంచి 26 వరకు, ఫిషరీస్ సబ్ సర్వీస్ లో  అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 8 వరకు, ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పోస్టులకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 వరకు అర్హత గల అభ్యర్థుల నుండి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది.