ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ఎపిపిఎస్సి మరో తీపి కబురు అందించింది. అటవీశాఖలో ఖాళీగా వున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 24 ఎఫ్ఆర్‌వో పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటించింది.

ఈ ఉద్యోగాల కోసం అర్హత గల అభర్థులు ఈ నెల 10 నుండి 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. బ్యాచిలర్ డిగ్రీతో పాటు తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. జనరల్ అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లుగా నిర్ధారించగా.... ఎస్సీ, ఎస్టీ, బిసిలకు మరో ఐదేళ్ల వయసు సడలించారు. 

ఇక ఉద్యోగాల భర్తీ ప్రక్రియ షెడ్యూల్ ను కూడా ఎపిపిఎస్సీ ప్రకటించింది. ఫిబ్రవరి 24 న స్క్రీనింగ్ పరీక్ష, ఎప్రిల్ 28 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే దరఖాస్తులు 25 వేలకు మించి వస్తేనే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని...అంతకంటే తక్కువగా వస్తే స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా నేరుగా మెయిన్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దేహదారుడ్య పరీక్ష కూడా ఉండనుంది..