న్యూఢిల్లీ: విద్యుత్ కొనుగోలు విషయంలో పీపీఏలను పున: సమీక్షించాలన్న ఏపీ ప్రభుత్వానికి అప్పిలేట్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై గ్రీన్ కో ఎనర్జీ గ్రూప్ కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. 

విచారణ చేపట్టిన అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మూడు నోటీసులపై స్టే విధించింది. ఇకపోతే యూనిట్ ధర రూ.4.50 పైసల నుంచి 2.40 పైసలకు తగ్గించాలని గ్రీన్ కో కంపెనీ, దాని అనుబంధ యూనిట్లకు ఏపీ సర్కార్ ఈఏడాది జూలై 12న నోటీసులు జారీ చేసింది. 

ఇకపోతే 2018లోనే గ్రీన్ కో ఎనర్జీ కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్ కు వెళ్లింది. 2018నాటి ఏపీఆర్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి గ్రీన్ కో ఎనర్జీ కంపెనీతోపాటు దాని అనుబంధం కంపెనీలు గ్రీన్ ప్లాష్, ఆరూషి, రేన్ కో కంపెనీలు.

అందులో భాగంగా కేసు విచారణ ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈఏడాది జూలై 12న జారీ చేసిన మూడు నోటీసులపై స్టే విధించింది.