Asianet News TeluguAsianet News Telugu

YS Sharmila: తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు వద్దు: కాంగ్రెస్ నేత హర్ష కుమార్

ఏపీతో వైఎస్ షర్మిలకు సంబంధం లేదని ఏపీ కాంగ్రెస లీడర్ హర్ష కుమార్ అన్నారు. ఆమె తెలంగాణకు చెందిన వారని, తెలంగాణ కోడలు అయినంత మాత్రానా ఆమెకు ఏపీపీసీసీ బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 
 

appcc chief post should not be given to ys sharmila says congress leader harsha kumar kms
Author
First Published Jan 11, 2024, 4:23 PM IST

YS Sharmila: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీల ఫిరాయింపులు, రాజీనామాలు, చేరికలు నిత్యం వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో దాదాపు శూన్యంగా మారిన కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వవైభవం తేవడానికి ఆ పార్టీ అధిష్టానం వైఎస్ షర్మిలను రంగంలోకి దింపింది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ చేరే నిర్ణయం తీసుకునే సమయంలో ఆమెకు పార్టీ కీలక హామీలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఆమెకు అప్పగించనున్నట్టూ వార్తలు వచ్చాయి. ఒక వేళ ఈ బాధ్యతలు కాకుంటే కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపిస్తారనే మాటలూ వినిపించాయి. అయితే, వైఎస్ జగన్‌ను బలంగా ఢీకొని కాంగ్రెస్‌కు అనూహ్య బలాన్ని తేవాలంటే ఏపీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకే అందించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే కాంగ్రెస్ రెబల్ లీడర్ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ షర్మిలకు ఏపీతో సంబంధం లేదని హర్ష కుమార్ అన్నారు. షర్మిల తెలంగాణకు చెందినవారని పేర్కొన్నారు. తెలంగాణ కోడలు అయినందున ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఆమెకు అప్పగించడం సబబు కాదని తెలిపారు. ఏపీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి రాష్ట్ర కాంగ్రెస్‌లో నాయకులే లేరా? అని ప్రశ్నించారు. వేరే రాష్ట్రానికి చెందిన నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాల్సిన దుస్థితలో కాంగరెస్ ఉన్నదా? అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 

Also Read : ప్రధాని మోడీ జోక్యంతో ఉక్రెయిన్ యుద్ధం తాత్కాలికంగా ఆగింది: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

వైఎస్ షర్మిలకు ఏ పదవి ఇంకా దక్కలేదు. అధిష్టానం కూడా ఇంకా ఏ ప్రకటనా చేయలేదు. ఇంతలోనే హర్ష కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నేతల్లో చర్చ మళ్లీ రాజుకుంది.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి పోటీ చేస్తానని హర్ష కుమార్ అన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన రాజమండ్రిలో దళిత సింహగర్జన నిర్వహిస్తున్నామని చెప్పారు. వైసీపీ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని, వైసీపీని గద్దె దించడానికి దళితులు సిద్ధంగా ఉన్నారని వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios