Asianet News TeluguAsianet News Telugu

శ్రీసత్యసాయి జిల్లాలో ఐదుగురు సజీవ దహనం: విచారణకు ఏపీసీపీడీసీఎల్ ఆదేశం

శ్రీసత్యసాయి హిందూపురం జిల్లాలోని తాడిపర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడి ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై ఏపీసీపీడీసీఎల్ సీఎండీ విచారణకు ఆదేశించారు. నాసిరకం విద్యుత్ వైర్ల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
 

APCPDCL CMD  Orders Probe  On Five people charred to death in Satya Sai district
Author
Guntur, First Published Jun 30, 2022, 10:49 AM IST

అనంతపురం:శ్రీసత్యసాయి జిల్లా తాడిపర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద  ఆటోపై హైటెన్షన్ విద్యుత్  వైర్  తెగిపడి ఐదుగురు కూలీలు సజీవ దహనం జరగడంపై APCPDCL విచారణకు ఆదేశించింది. ఏపీసీడీసీఎల్ CMD ఈ విషయమై శ్రీసత్యసాయి జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండ్ ను ఆదేశించారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపోవడానికి గల కారణాలపై  నివేదిక ఇవ్వాలని సీఎండీ ఆదేశించారు.

గురువారం నాడు ఉదయం ప్రమాదం జరగడానికి ముందు రోజు రాత్రి నుండి ఈ ప్రాంతంలో నిప్పు రవ్వలు పస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపోయి నిప్పురవ్వలు వస్తున్నాయని స్థానిక Farmers  మీడియాకు చెప్పారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలు ఈదురు గాలులతో వైర్లు బలహీనపడిపోయాయని స్థానికులు చెబుతున్నారు. నాసిరకం విద్యుత్ వైర్లను ఉపయోగించారని స్థానికులు  ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు.

మరో వైపు High Tension విద్యుత్ వైర్  అతి తక్కువ ఎత్తులో ఉండడం కూడా ప్రమాదానికి  కారణమైందని కూడా స్థానికులు చెబుతున్నారు.  ప్రమాదానికి గురైన Auto  కంటే ముందు రెండు మూడు ఆటోలు కూడా ఈ ప్రాంతం నుండి ముందుకు వెళ్లాయి. ఈ ఆటోల్లో ప్రయాణీస్తున్న వారు కూడా ఈ ప్రాంతంలో విద్యుత్ వైర్ల నుండి నిప్పు రవ్వలు వస్తున్న విషయాన్ని గమనించారు. కానీ ఈ విషయమై వెనుక నుండి వచ్చే వాహనదారులను అప్రమత్తం చేయలేదు. కూలీలతో వెళ్తున్న ఆటోపై తెగిపోయిన హైటెన్షన్ వైరు తెగిపడి పోవడంతో ఆటోలో ప్రయాణీస్తున్నవారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.మిగిలినవారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ తో పాటు 12 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు ఆటోలోనే సజీవ దహనమయ్యారు. ఈ ఆటో నుండి ఆరుగురు బయట పడ్డారు. మృతులు గుడ్డంపల్లి, పెద్దకోట్లగ్రామస్తులు.  మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులను కాంతమ్మ, రాములమ్మ, రత్నమ్మ, లక్ష్మీదేవి, కుమారిగా గుర్తించారు. సజీవ దహనం కావడంతో మృతదేహలు పూర్తిగా దగ్దమయ్యాయి. మృతదేహలను పోస్టుమార్గం నిమిత్తం ధర్మవరం ఆసుపత్రికి తరలించారు.

also read:సత్యసాయి జిల్లా‌లో తీవ్ర విషాదం.. ఆటో మీద కరెంట్ తీగెలు తెగిపడి ఐదుగురు సజీవ దహనం..

హైటెన్షన్ విద్యుత్ వైరు తెగిపడే పరిస్థితి వచ్చినా కూడా విద్యుత్ శాఖాధికారులు పట్టించుకలేదని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వైర్ తెగిపడే స్థితి వచ్చిందని గుర్తించి వెంటనే మరమత్తులు చేపడితే పరిస్థితి మరోలా ఉండేదని కూడా మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎంపీ గోరంట్ల మాధవ్

ప్రమాదం జరిగిన స్థలాన్ని హిందూపురం ఎంపీ Gorantla Madhav గుురువారం నాడు ఉదయం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నాసిరకం విద్యుత్ వైర్ల కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఎంపీ మాధవ్ ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకొంటామని ఎంపీ హామీ ఇచ్చారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ విషయమై ఆరా తీశారన్నారు  ఈ ఘటనలో గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించనున్నట్టుగా ఆయన చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios