Asianet News TeluguAsianet News Telugu

14 జాతీయ పార్టీలతో ఎపిసిసి ప్రత్యేక హోదా సభ

  ప్ర‌త్యేక హోదా కోసం పార్లమెంటులో కాంగ్రెస్ కు  మ‌ద్ద‌తు ఇచ్చిన 14 పార్టీల నేత‌ల‌తో  జూన్‌లో కాంగ్రెస్ పార్టీ భీమ‌వ‌రంలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించేందుకు      సన్నాహాలు. రాష్ట్ర కమిటీ ఉద్యమానికి  ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ మద్ధతు

 

 

 

 

 

apcc to invite 14 national parties to state for special status public meeting

ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు నినాదంతో 
 ఏపికి ప్ర‌త్యేక హోదా కెసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చేస్తున్న ఉద్య‌మానికి ఏఐసిసి ఉపాధ్య‌క్షులు రాహుల్‌గాంధీ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి అధ్వ‌ర్యంలో ఢిల్లీ వెళ్లీ ఏపిసిసి బృందం ఢిల్లీ వెళ్లి రాహుల్ ను కలిసింది.

 

 ఏపికి ప్ర‌త్యేక త‌ర‌గ‌తి హోదా బిల్లును రాజ్య‌స‌భ‌లో బ‌ల‌ప‌ర్చిన 
14 జాతీయ పార్టీల‌ను రాష్ట్రానికి   ఆహ్వనించేందుకు    ఏపిసిసి బృందం ఢిల్లీ వచ్చింది.


 
 కేంద్రంలో ప్ర‌త్యేక హోదా కోసం మ‌ద్ద‌తు ఇచ్చిన 14 పార్టీల నేత‌ల‌తో  క‌లిసి
  జూన్‌లో కాంగ్రెస్ పార్టీ భీమ‌వ‌రంలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని ఎపిసిసి నిర్ణయించింది.

 

  రాజ్య‌స‌భ స‌భ్య‌లు కె.వి.పి రామ‌చంద్ర‌రావు,  కె.ఎస్‌.ఆర్‌(సుబ్బిరామిరెడ్డి)
 మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌,  మాజీ కేంద్ర మంత్రి జేడిశీలం, త‌దిత‌రులు ఢీల్లీ వెల్లీన ఏపిసిసి బృందంలొ ఉన్నారు..


తర్వాత,
కేంద్ర‌భూసేక‌ర‌ణ చ‌ట్టానికి రాష్ట్ర ప్ర‌భుత్వం  చేసిన స‌వ‌ర‌ణ‌ల‌కు వ్య‌తిరేకంగా  ఏపిసిసి  అధ్య‌క్షులు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరాడ్డి అధ్వ‌ర్యంలోని  బృందం రాష్ట్ర‌ప‌తిని క‌లిసి విన‌తి  ప‌త్రం  అందించ‌నున్నారు.....

Follow Us:
Download App:
  • android
  • ios