#RajaPriya క్రైస్తవ మతాచారం ప్రకారమే వైఎస్ షర్మిల కొడుకు పెళ్ళి...వీడియో ఇదిగో...

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, వైఎస్ షర్మిల-అనిల్ దంపతుల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్టహాసంగా జరిగింది.  అయితే ఈ వివాహం ఏ మతాచారం ప్రకారం జరిగిందో స్వయంగా షర్మిల బయటపెట్టారు. 

APCC Chief YS Sharmila son Raja Reddy Marriage Photos and Videos AKP

జోధ్ పూర్ : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని జోధ్‌పూర్ ప్యాలెస్ లో రాజారెడ్డి-ప్రియ జంట వివాహ వేడుకలు మూడు రోజులపాటు జరిగాయి. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే ఈ పెళ్లి జరిగినట్లు వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను బట్టి తెలుస్తోంది. జీసస్ ముందు క్రైస్తవ మతగురువు రాజారెడ్డి-ప్రియ దంపతులతో ఉంగరాలు తొడిగించారు. 

కొడుకు వివాహ వేడుకలో వైఎస్ షర్మిల-అనిల్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విలాసవంతమైన జోధ్ పూర్ ప్యాలెస్ లో కొడుకుతో కలిసి ఈ జంట ప్రత్యేక ఫోటోలు, వీడియోలకు ఫోజులిచ్చారు. అలాగే వైఎస్ విజయమ్మ కూడా మనవడి వివాహవేడుకలో పాల్గొన్నారు. వైఎస్, అట్లూరి  కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య రాజారెడ్డి-ప్రియ వివాహం జరిగింది.   

 

అయితే షర్మిల సోదరుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ, ఆయన సతీమణి వైఎస్ భారతి గానీ ఈ వివాహ వేడుకకు హాజరుకాలేదు. హైదరాబాద్ లో జరిగిన మేనల్లుడి ఎంగేజ్ మెంట్ కు సతీసమేతంగా హాజరయ్యారు జగన్. ఈ సమయంలో షర్మిల అతడికి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వైఎస్ జగన్ పెళ్లికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.  

ఇదిలావుంటే అంగరంగ వైభవంగా జరిగిన కొడుకు  వివాహ వేడుకకు సంబంధించిన వీడియో, ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు వైఎస్ షర్మిల. ''ఒకరి కోసం మరొకరు పుట్టారన్నట్లుగా వున్న అందమైన జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిని మా నాన్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వర్గం నుండి ఆశీర్వదించినట్లుగా అనిపించింది.  ఎంతో వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక నా మదిలో చిరకాలం నిలిచివుంటుంది. అంతులేని ఆనందం, ప్రేమానురాగాలతో దాంపత్య జీవితాన్ని ఆస్వాదించాలని ఆశీర్వదిస్తున్నా'' అంటూ కొడుకు-కోడలిని వివాహ వీడియోను పోస్ట్ చేస్తూ కామెంట్ చేసారు. 

అంతకు ముందు రాజారెడ్డి-ప్రియ జంట పెళ్లి ఫోటోలను కూడా షర్మిల పంచుకున్నారు.  ''తల్లిగా నా జీవితంలో మరో ఆనందభరిత క్షణమిది... ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆత్మీయుల ఆశీర్వాదం, అభినందనలు...  ఆ దేవుడి దయతో నా కొడుకు, ప్రేమించిన అమ్మాయిని జీవిత భాగస్వాములుగా మారారు. ఈ పెళ్లి వేడుక, ఆనందభరిత జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోతాయి'' అంటూ షర్మిల కొడుకు పెళ్లి ఫోటోలను పంచుకుంటూ ఎమోషన్ అయ్యారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios