వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. మోదీ, కేసీఆర్‌కు జగన్‌, పవన్‌ ఏజెంట్లు అంటూ ఘాటుగా విమర్శించారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తిరుపతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. మోదీ, కేసీఆర్‌కు జగన్‌, పవన్‌ ఏజెంట్లు అంటూ ఘాటుగా విమర్శించారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

మంగళవారం తిరుపతిలో మాట్లాడిన రఘువీరారెడ్డి జగన్, పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఏ పార్టీకి మద్దతిస్తారో జగన్, పవన్ చెప్పగలరా? అని నిలదీశారు. అసెంబ్లీకే పోటీ చేయలేనివారు పార్లమెంట్‌కు పోటీ చేస్తారా? అని నిలదీశారు. 

తెలంగాణలో పోటీ చెయ్యలేనివారు పీ అసెంబ్లీకి మాత్రం పోటీ చేయడం ఎందుకు? అంటూ చురకలు వేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై డిసెంబర్ 15 తర్వాత ఓ నిర్ణయం వెలువడొచ్చని రఘువీరా అభిప్రాయపడ్డారు. రాహుల్ ప్రధాని కావాలని ఏపీలో 72% మంది కోరుకుంటున్నారని తెలిపారు.