కాకినాడ:ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రఘువీరా పునర్విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ ను బీజేపీ నట్టేట ముంచిందని తెలిపారు. జీఎస్టీని సరళీకృతం చేస్తామని చెప్పుకొచ్చారు. సామాజిక, ఆర్థిక సుస్థిరత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాఫెల్ కుంభకోణంలో ప్రధాని మోదీ దోషిగా నిలబడ్డారన్నారు. 

థర్డ్ ఫ్రంట్ అనేది కూలిపోయే టెంట్ అంటూ వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలిసంతకం హోదాపైనేనని రఘువీరా స్పష్టం చేశారు.