అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి లేఖ రాశారు. కేంద్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరారు. యూపీఏ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించాలని కోరారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు కోసం కేసీఆర్ చేసిన ప్రకటనకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పలు రాజకీయ అంశాలపై రఘువీరారెడ్డి లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసేదిశగా పావులు కదుపుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ టీఆర్ఎస్ పైనా, కేసీఆర్ పైనా మాటల తూటాలు పేల్చుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి లేఖ రాయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.